📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Today News : Reservoirs – సోమశిల, కండలేరు జలాశయాల్లో 100 టిఎంసిల నీటి నిల్వలు

Author Icon By Shravan
Updated: August 29, 2025 • 12:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Reservoirs : జిల్లాలో ఎన్నడూ లేని విధంగా రెండో పంటకు నీళ్లు ఇచ్చిన తర్వాత కూడా సుమారు 100 టీఎంసీల నీరు నిల్వ ఉండడం నెల్లూరు జిల్లా (Nellore District) సాగునీటి రంగంలో ఒక నూతన అధ్యాయమని రాష్ట్ర మంత్రి దేవాదాయశాఖ ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం నెల్లూరు సంతపేటలోని క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని జలాశయాల్లో నీటి నిల్వల పరిస్థితిపై మంత్రి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలోని ప్రధాన జలాశయాలైన సోమశిల, కండలేరు జలాశయాల్లో సుమారు 90 నుంచి 100 టీఎంసీల సమృద్ది నీటి నిల్వలతో కళకళలాడుతున్నాయని చెప్పారు. రైతాంగానికి ప్రజలకు శుభపరిణామమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలో చేపట్టిన సమర్థవంతమైన సాగునీటి నిర్వహణ వలన నేడు జిల్లాలో సమృద్ధిగా నీటి నిల్వలు అందుబాటులో ఉన్నట్లు మంత్రి వివరించారు. దాదాపు ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు సత్యవేడు, శ్రీకాళహస్తిని కలుపుకొని మొదటి పంటకు దాదాపు ఆరు లక్షల ఎకరాలకు (Six lakh Acres) నీళ్లిచ్చినట్లు చెప్పారు. సోమశిల, తెలుగుగంగ ప్రాజెక్టుల్లో మొదటి పంట తరువాత కూడా రెండవ పంటకు నీళ్లు అందించినా ఇంకా మిగులు నీళ్లు ఉన్నాయన్నారు.

సోమశిల, కండలేరు జలాశయాల్లో 100 టిఎంసిల నీటి నిల్వలు

ఉమ్మడి నెల్లూరు జిల్లా సత్యవేడు శ్రీకాళహస్తి కలిపి రెండో పంటకు ఐదు లక్షల 24 వేల ఎకరాలకు ఒక్క నెల్లూరు జిల్లాలో దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు రెండో పంటకు నీళ్లు ఇచ్చినట్లు చెప్పారు. రెండో పంట చివరి దశకు వచ్చిందన్న మంత్రి, మరో 20 రోజుల్లో వరి కోతలు మొదలవుతున్నాయని చెప్పారు. సోమశిల జలాశయంలో 59 టీఎంసీలు, కండలేరు, తెలుగు గంగలో 35 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నట్లు చెప్పారు. ఒక్క చుక్క నీరు కూడా వృధా కాకుండా, ప్రతి వంటకు నీరు అందించడమే ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. రైతన్నలు కూడా ప్రతి నీటి చుక్కను ఉపయోగించుకోవాలి గాని అనవసరంగా వృధా చేయకూడదని మంత్రి విజప్తి చేశారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/tirumala-annual-brahmotsavams-of-govinduni/andhra-pradesh/537606/

Anam Ramanarayana Reddy updates Andhra Pradesh reservoirs 2025 AP water resources news Breaking News in Telugu Kandaleru reservoir storage Latest News in Telugu Somasila Kandaleru water storage Somasila reservoir water levels Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.