📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Districts : జిల్లాల పేర్ల మార్పుపై సెప్టెంబర్ 15న నివేదిక

Author Icon By Shravan
Updated: August 14, 2025 • 9:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Districts : జిల్లా, మండల, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై వచ్చే నెల 15 తేదీ నాటికి తమ నివేదిక సిఎం చంద్రబాబుకు సమర్పించాలని మంత్రుల బృందం (GOM) నిర్ణయించింది. రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తోపాటు ఏడుగురు మంత్రులతో ఏర్పాటైన జిఒఎం తొలిసారిగా బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో భేటి అయ్యింది. ఈ సమావేశానికి మంత్రి అనగానితోపాటు మంత్రులు పి. నారాయణ, వంగలపూడి అనిత, బిసి జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ తోపాటు రెవెన్యూ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డిసెంబర్ 31లోగా జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుల ప్రక్రియ మొత్తంగా ముగించాల్సి ఉన్నందున జిఒఎం తన నివేదికను సెప్టెంబర్ 15వ తేదీ నాటికి సిఎం చంద్రబాబు నాయుడుకి అందజేస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత ప్రభుత్వం జిల్లాల పునర్వీభజన సక్రమంగా చేయని కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వాటన్నింటిని సరిచేసేందుకే జిఒఎంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనెల 29, 30 తేదీల్లో మంత్రుల బృందం రెండు గ్రూపులుగా ఉమ్మడి జిల్లా (Joint district) కేంద్రాల్లో పర్యటిస్తుందని, ఆ సమయంలో ప్రజాప్రతినిధులు, ప్రజల నుండి వినతులు స్వీకరిస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం వద్దకు వచ్చిన అనేక సూచనలపై చర్చించామని, రానున్న కాలంలోనూ వినతులు స్వీకరించి వాటన్నింటినీ క్రోడికరించి సెప్టెంబర్ 15వ తేదీ నాటికే నివేదికను సిఎంకు అందజేస్తామని చెప్పారు. ప్రజలు ఇప్పటి నుండే కలెక్టర్లకు తమ వినతులను ఇవ్వొచ్చునని, వినతులు ఇచ్చేందుకు సెప్టెంబర్ 2 అఖరు తేదీ అని చెప్పారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులతోపాటు కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని కూడా జిఒఎం పరిశీలిస్తుందని చెప్పారు. అయితే నియోజకవర్గాలతో జిఒఎంకు సంబంధం లేదని, వాటి జోలికి పోవడం లేదని అన్నారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రభుత్వానికి ఆదాయం పెరగడం లక్ష్యంగా తమ సూచనలు ఉంటాయని చెప్పారు.

మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు గిరిజనులకు అందుబాటులో ఉండేవిధంగా రెండు గిరిజన ప్రాంతాలను కూడా మంత్రుల బృందం పర్యటించి వారి నుండి అభిప్రాయాలు తీసుకుంటుందని చెప్పారు. జిఒఎం సమావేశం జరుగుతూ ఉండగానే దాదాపు 15 మంది జిల్లా, మండల, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పుపై మంత్రుల బృందానికి తమ వినతులను సమర్పించారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరు లేదా పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని వినతి పత్రం సమర్పించారు. అలాగే చీరాల నుండి వచ్చిన కొందరు బాపట్ల జిల్లా కేంద్రాన్ని చీరాలకు మార్చాలని, బాపట్ల జిల్లాకు దుగ్గిరాల గోపాల క్రిష్ణయ్య పేరు పెట్టాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా మురపాక నుండి వచ్చిన బిఎస్ నాయుడుతోపాటు ఆ గ్రామస్తులు తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరారు. క్రిష్ణా జిల్లా మడిచర్ల గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ మరియు ఆ గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని బాపులపాడు మండలం నుండి తీసేసి నూజీవీడు మండలంలో గానీ, ముసునూరు మండలంలో గానీ కలపాలని కోరారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/free-bus-for-women-state-transport-minister-ramprasad-reddy/andhra-pradesh/530042/

Andhra Pradesh Districts Breaking News in Telugu district names change Latest News in Telugu latest updates Political News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.