ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ (APSRTC) లో ఈనెల 12 సమ్మెకు అద్దె బస్సుల యజమానులు సిద్ధమవుతున్నారు.. ఈ మేరకు ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇవ్వబోతున్నారు. ‘స్త్రీశక్తి’ పథకం అమలుతో పెరిగిన నిర్వహణ ఖర్చులు పెరిగాయి అంటున్నారు. అందుకే అదనంగా నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు చెల్లించాలని వారు కోరుతున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ (APSRTC) యాజమాన్యం మంగళవారం రాత్రి అద్దె బస్సుల యజమానుల ప్రతినిధులతో చర్చించింది.
Read Also: AP: ఇవాళ కాకినాడ లో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్
ప్రయాణికులపై ప్రభావం
చర్చల అనంతరం, ఒక్కో బస్సుకు నెలకు రూ.5,200 చొప్పున పెంచుతూ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మెకు సిద్ధమైతే.. మొత్తం 2,700 అద్దె బస్సుల్లో 2,419 బస్సులు.. ముఖ్యంగా స్త్రీ శక్తి పథకం కింద నడుస్తున్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ వంటివి ఈ నెల 12 నుంచి నిలిచిపోతాయి. సంక్రాంతి పండుగ సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో బస్సులు ఆగిపోతే ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: