📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu news : Cotton : పత్తి కొనుగోళ్ల నిబంధనలు తొలగించాలి!

Author Icon By Sudha
Updated: November 11, 2025 • 4:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెండు తెలుగు రాష్ట్రాల్లో పత్తిరైతులు తీవ్రసంక్షోభంలో ఉన్నారు. ఒకప్పుడు తెల్లబంగారంగా, రైతాంగానికి సిరులపంటగా పేరుపొందిన పత్తిసేద్యం, నేడు రైతాంగానికి ఉరితాడుగా మారుతూ ఉంది. సేద్యపు ఖర్చులు పెరగడం, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోవటం, గిట్టుబాటు ధర లభించకపోవటం, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల చేయూత లేకపోవటం అందుకు కారణంగా ఉంది. నేడు భారీవర్షాల వల్ల రెండు రాష్ట్రాల్లో మిగిలిన పంట అమ్ముకోవటానికి రైతాంగం తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారతదేశంలో పత్తి (Cotton )సాగు విస్తీర్ణం 120.55 లక్షల హెక్టార్లు. ప్రపంచంలో మొత్తం సాగు విస్తీర్ణంలో ఇది సుమారు 36 శాతంగా ఉంది. పత్తిసాగులో దేశం మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. అయినా భారతదేశ అవస రాలకు సరిపోక దిగుమతులు తప్పనిసరి అయ్యాయి. అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా చైనా దేశాల నుండి దిగు మతులు చేసుకుంటున్నాం. పత్తి దిగుబడుల్లోనూ భారత దేశం బాగా వెనకబడి ఉండటమే అందుకు కారణం. ప్రపంచ విత్తన పత్తి సగటు దిగుబడి హెక్టార్కు 1,670 కిలోలు. భారతదేశంలోసగటు దిగుబడి హెక్టార్కు 500 కిలోలు. చైనాలో ప్రపంచ సగటు దిగుబడికన్నా రెట్టింపు ఎక్కువ. పత్తి (Cotton )కి కేంద్రప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర ఎప్పుడూ రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా లేదు. అది రైతు ప్రయోజనాలను కాకుండా బడాపారిశ్రామికవేత్తల ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందన్నది వాస్తవం.

Cotton

స్వామినాథన్ సిఫార్సు

ప్రస్తుతం పత్తిమద్దతు ధర క్వింటాలుకు 8,110గా ఉంది. స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం 10,075 రూపాయలు ఉండాలి. స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా మద్దతు ధరలు ప్రకటిస్తున్నామని కేంద్రప్రభుత్వం చెప్పటంలో ఉన్న మోసం పత్తి మద్దతు ధర ప్రకటన బట్టబయలు చేస్తున్నది. భారతదేశం ప్రతిసంవత్సరం లక్షల బేళ్ల పత్తిని దిగుమతి చేసుకుంటున్నది. ఈ సంవత్సరం మూడు లక్షల బేళ్ల పత్తి దిగుమతి అయ్యింది. ట్రంప్, పశ్చిమదేశాల వత్తిడికి లొంగిన కేంద్ర ప్రభుత్వం పత్తిదిగుమతులపై పూర్తిగా సుంకాన్ని ఎత్తివేసింది. ఫలితంగా విదేశాల నుండి పెద్దఎత్తున పత్తి దిగుమతులు పెరిగాయి. దిగుమతుల వల్ల దేశంలో పత్తి రేట్లు తగ్గుతాయి. ప్రపంచ మార్కెట్లో ప్రస్తుతం క్వింటాల్ గింజ పత్తి ధర 5,720 రూపాయలు. భారతదేశం దిగుమతి సుంకం విధిస్తే దేశంలో దిగుమతి పత్తి ధర ఇంకా ఎక్కువ ఉండేది. అలా చేయకపోవడంతో దిగుమతి పత్తి ధర తక్కువగా ఉండటంతో టెక్స్టైల్ మిల్లుల యజ మానులు విదేశాల పత్తినే కొనుగోలు చేస్తున్నారు. దీన్ని గమనిస్తే కేంద్ర ప్రభుత్వానికి దేశ రైతుల ప్రయోజనాల కన్నా విదేశీ పత్తికంపెనీల ప్రయోజనమే ముఖ్యమని చెప్ప కనే చెబుతున్నది. పత్తి దిగుమతుల వల్ల భారతపత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 45.32 లక్షల ఎకరాల్లో 24.12 లక్షల మంది రైతులు పత్తిసాగు చేస్తున్నారు. వీరిలో 70శాతంమంది చిన్న, సన్న కారు రైతులే. పత్తి మద్దతు ధరను క్వింటాలు 7720 నుంచి 8110 రూపాయలుగా కేంద్రం ప్రకటించింది. ప్రతి సంవత్సరం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వ్యాపారులకు విక్రయిస్తున్నారు.

Cotton

అవినీతి

పత్తి కొనుగోలులో సీసీఐ విఫలమైనప్పుడు మద్దతు ధరకు రైతుల నుండి పత్తి కొనుగోళ్లు రాష్ట్రప్రభుత్వాలు చేపట్టాలి. రెండు తెలుగురాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి బాధ్యత తీసు కోలేదు. వ్యాపారులు, సీసీఐ అధికారులు కుమ్మక్కై పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు దారితీసింది. రైతుల నుంచి సీసీఐ కొనటానికి నిరాకరించిన పత్తిని వ్యాపారులు రైతుల నుండి చౌకగా కొనుగోలుచేశారు. అలాకొన్న పత్తిని అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతుల పేరుతో పత్తి పండించినట్లు నకిలీపత్రాలు సృష్టించి తిరిగి సీసీఐకే మద్దతు ధరకు అమ్ము తున్నారు. గతంలో ఆంధ్రా, తెలంగాణలో ఇలాంటి కుంభకో ణాలు వందలాది కోట్ల రూపాయల్లో జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో 2017-18, 2018-౧౯ మధ్యలో పత్తి కొను గోళ్లలో రూ. 400 కోట్లు అవినీతి జరిగినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. ఇలాంటి అవినీతే ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల రైతాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ, ఎటువంటి వంకలు లేకుండా రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయా లని, నష్టపోయిన పత్తిధర రైతులకు ఎకరాకు 25 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని, ఏడుక్వింటాళ్ల కొనుగోలు నిబంధన విరమించాలని, క్వింటాల్ ఉత్పత్తికి 10 వేల మద్దతుధర ప్రకటించాలని, దిగుమతి పత్తిపై 30శాతం సుంకం విధించాలని, పత్తి దిగుమతిని పరిమితం చేయాలని, పత్తిరైతులకు బ్యాంకులు ఇచ్చిన పంటరుణాలు రద్దుచేయాలని రెండు రాష్ట్రాల రైతాంగం ఉద్యమించాలి.
-బొల్లిముంతసాంబశివరావు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

agriculture Breaking News Cotton cotton farmers cotton procurement farming latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.