📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్

Jagan Birthday : చీపురుపల్లిలో ఘనంగా జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

Author Icon By Sudheer
Updated: December 21, 2025 • 11:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం చీపురుపల్లి నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరిగాయి. గరివిడిలోని బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు వైఎస్ఆర్సీపీ నాయకురాలు డాక్టర్ బొత్స అనూష ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్‌ కటింగ్ మరియు రక్తదాన శిబిరంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ…”మాట ఇస్తే మడమ తిప్పని నేతగా, జననేతగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పేద ప్రజలకు అండగా నిలిచారు. బలహీన వర్గాలకు విస్తృతంగా సంక్షేమ పథకాలు అందించి, మనసున్న మహారాజుగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని” పేర్కొన్నారు.

మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ.. “అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులకు ప్రజల కష్టాలు పట్టడం లేదు. జగన్ గారు ప్రవేశపెట్టిన విప్లవాత్మక మార్పులను చూసి ఓర్వలేకనే కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఉపాధి హామీ నిధులను దారి మళ్లించి పేదవాడి నోటి దగ్గర కూడును లాగేసుకుంటున్నారు,” అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

డాక్టర్‌ బొత్స సందీప్‌ మాట్లాడుతూ…”యువతకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆదర్శప్రాయులు. ఆయన పుట్టినరోజు వేడుకల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. నిరుపేద కుటుంబాలను పలకరిస్తే మళ్లీ జగనన్నే సీఎం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారని” తెలిపారు.

డాక్టర్‌ బొత్స అనూష మాట్లాడుతూ…”జగన్ గారి జన్మదిన వేడుకలను ఇంత ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉంది. రక్తదాన శిబిరానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మధ్యకు వెళ్లడం సంతోషాన్నిచ్చింది. మళ్లీ జగనన్న అధికారంలోకి వచ్చి, తమ జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రజలు భగవంతుడిని ప్రార్థిస్తున్నారని” పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన శాసనమండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారికి, మాజీ పార్లమెంట్‌ సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్‌ గారికి, డాక్టర్‌ బొత్స సందీప్‌ గారికి* ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే చీపురుపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసాల వరహాల నాయుడు, ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, బెల్లాన వంశీకృష్ణ, మీసాల విశ్వేశ్వరరావు, కోట్ల వెంకటరావు, తాడ్డి వేణు, పోట్నూరి సన్యాసి నాయుడు, అప్పల నాయుడు గార్లకు మరియు ఇతర పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులకు ఆమె పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

Breaking News: Droupadi Murmu: VB-G RAM G బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

bbotsa Cheepurupalli Google News in Telugu jagan birthday Jagan Birthday Celebrations Telugu News YS Jagan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.