📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Today News: Recruitment – ఇకపై ప్రతి యేటా డీఎస్సీ టీచర్ పోస్టుల భర్తీ – మంత్రి లోకేష్

Author Icon By Shravan
Updated: August 23, 2025 • 10:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ Recruitment : రాష్ట్రంలో ఇకపై టీచర్ పోస్టుల (Teacher posts) భర్తీకి ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారాలోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యలో విద్యాప్రమాణాలను మెరుగుపర్చేందుకు గత 14నెలలుగా సమర్థవం తంగా సంస్కరణలు అమలు చేశామని ఉద్ఘాటించారు. ఫలితాలు రాబట్టే బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులదేనని దిశానిర్దేశం చేశారు. దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో కీలక మోలిక సదుపాయాలు కల్పిస్తున్నామని నొక్కిచెప్పారు. అమరావతిలో (Amaravati) ఏడాదిలోగా సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. విద్యాశా ప్రభుత్వ విద్యలో విద్యాప్రమాణాలను మెరుగుపర్చేందుకు గత 14నెలలుగా సమర్థవం తంగా సంస్కరణలు అమలు చేశామని ఉద్ఘా టించారు. ఫలితాలు రాబట్టే బాధ్యత అధికా రులు, ఉపాధ్యాయులదేనని దిశానిర్దేశం చేశారు. దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాల ల్లో కీలక మోలిక సదుపాయాలు కల్పిస్తున్నామని నొక్కిచెప్పారు. అమరావతిలో ఏడాదిలోగా సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

ఏపీ విద్యాశాఖ సంస్కరణలపై మంత్రి లోకేష్ సమీక్ష, ఎఫ్ఎల్ఎన్ ప్రాధాన్యం

విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ శుక్రవారం ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలుకీలక సూచనలు చేశారు. ఏపీ చరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించి, విజయవంతంగా నిర్వహించామని వ్యాఖ్యానించారు అనవసరమైన శిక్షణా కార్యక్రమాలతో ఉపాధ్యాయుల విలువైన సమయాన్ని వృథా చేయొద్దని సూచించారు. సంస్కరణల అంతిమలక్ష్య అభ్యసన ఫలితాలేనని తెలిపారు. అసర్ నివేదిక ప్రకారం ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) ప్రోగ్రామ్ అమల్లో జాతీయస్థాయిలో ఏపీ 14వ స్థానంలో ఉందని ఉద్ఘాటించారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని మెరుగైన ర్యాంక్ సాధించేందుకు నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. దేశంలోనే తొలిసారిగా ప్రతిబిడ్డకు గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ఒక హక్కుగా ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. తల్లికి వందనం చివరి దశ నిధులను విడుదల చేశామని ప్రకటించారు. తల్లికి వందనం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేశామని గుర్తుచేశారు.

చివరి విడతగా పెండింగ్ దరఖాస్తులను ఆమోదిస్తూ రూ.325కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 2024 -2025 ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీలో కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలకు దాతల సహకారంతో భూసేకరణకు చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ మార్గనిర్దేశం చేశారు.

Recruitment – ఇకపై ప్రతి యేటా డీఎస్సీ టీచర్ పోస్టుల భర్తీ – మంత్రి లోకేష్

రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధికి దాతల సహకారం అవసరం

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో కీలకమైన మోలిక సదుపాయాల అభివృద్ధికి దేశ, విదేశాల్లో స్థిరపడిన ప్రముఖులు, దాతల సహకారం తీసుకోవాలి. ఆసక్తిగల తమ గ్రామాల్లోని స్కూళ్లను దత్తత తీసుకునేలా ఆయా స్కూళ్లకు అవసరమైన మోలికసదు పాయాలతో ప్రత్యేకమైన వెబ్ సైట్ రూపొందిం చాలి. జాతీయస్థాయిలో పేరెన్నికగన్న కార్పొరేట్ సంస్థల సహకారాన్ని కూడా తీసుకోవాలి. రాష్ట్రంలోని అనంతపురం, నెల్లూరు, ఏలూరు, కడప చిత్తూరులలో ఆధునీకరించిన సైన్స్ సెంటర్లను త్వరగా ప్రారంభించి, విద్యార్థులకు ఉపయోగకరంగా తీర్చిదిద్దండి. రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన 125 ఆటిజం సెంటర్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించి, ఏడాదిలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి. దేశంలోనే అత్యుత్తమ మోడల్ తో అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ నిర్మాణాన్ని చేపట్టాలి. 2లక్షల చదరపు అడుగుల్లో డిజైన్ చేస్తున్న ఈ లైబ్రరీ నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోండి.

విశాఖలో రీజనల్ లైబ్రరీ నిర్మాణానికి వేగం

విశాఖపట్నం జగదాంబ సెంట్రల్లో ప్రతిపాదిం చిన రీజనల్ లైబ్రరీని 50వేల అడుగుల్లో నిర్మించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి లోకేష్ ఆదేశించారు. రాష్ట్రంలో పబ్లిక్ లైబ్రరీల బలోపేతానికి చేప ట్టాల్సిన చర్యలపై మంత్రి లోకేష్ చర్చించారు. స్థానిక సంస్థల నుంచి సుమారు రూ.213 కోట్ల రూపాయల మేర సెస్సు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని రాబట్టి లైబ్రరీలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య కమిషనర్ విజయరా మరాజు, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ కృతికా శుక్లా, సర్వశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరక్టర్ బి.శ్రీనివాసరావు, విద్యా మోలిక సదుపాయాల సంస్థ ఎండి సిఎన్ దీవెన్ రెడ్డి, పబ్లిక్ లైబ్రరీస్ డైరక్టర్ కృష్ణమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/football-argentina-team-plays-friendly-match-in-kerala/sports/534769/

Andhra Pradesh Teachers Breaking News in Telugu DSC 2025 DSC notification DSC recruitment latest news AP Latest News in Telugu Teacher Recruitment Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.