📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

Reconstruction : ఎపి పునర్నిర్మాణం దిశగా ‘పి-4’

Author Icon By Shravan
Updated: July 29, 2025 • 2:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్వర్ణాంధ్ర పి4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ సి.కుటుంబరావు

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి (For Reconstruction) దిశానిర్దేశకుడిగా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనీయుడని స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ సి. కుటుంబరావు అన్నారు. ఉగాది పర్వదినాన పీ4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్ పార్ట్ నర్ షిప్ ప్రోగ్రాం)ను ఘనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్న వారు స్వచ్చందంగా అట్టడుగునున్న కుటుంబాలు, వ్యక్తులు, గ్రామాల అభివృద్ధిలో తోడ్పడే అవకా శాన్ని కల్పిస్తోంది.

పీ4 పథకం లక్ష్యం సమాజంలో ఎవరైతే బాగా ఆర్థికంగా బలంగా ఎదిగారో, వారు అట్టడుగున ఉన్న బడుగు వర్గాలకు సహాయం అందిస్తే అసమా నతలు తొలగుతాయి, సమాజంలో సమానత్వం నెలకొంటుంది. ప్రతి ఒక్కరూ వెల్తీ, హెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ (Andhara pradesh) పౌరులుగా జీవించగలు గుతారు. ఈ ఉద్దేశంతో ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించి ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాల్సిన కుటుంబాలను బంగారు కుటుం బాలుగా గుర్తించింది. సహాయం చేయగల సామర్థ్యం ఉన్నవారిని మార్గదర్శకులుగా గుర్తించి నమోదు చేసింది. ఈ పథకం పూర్తిగా వాలంటరీ, అంటే స్వచ్ఛందమే. ఎవరూ ఎవరినీ బలవం తంగా ఇందులో చేర్చడం లేదు. ఇటీవల కొన్ని విపక్షాలు, కొంతమంది వ్యక్తులు పీ4 పథకంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. డిఇఓ (జిల్లా విద్యాశాఖ అధికారి) హెడ్ మాస్టర్లు, టీచర్లను మార్గదర్శకులుగా ఎన్రోల్ కావాలని ఫోర్స్ చేస్తున్నారనే ఆరోపణలు అవాస్తవం.

ఎటువంటి అధికార ఆదేశాలు విడుదల కాలేదు. ఎవరికి ఇష్టమైతే వారు మాత్రమే ఈ కార్యక్ర మంలో పాలుపంచుకోవచ్చు. ఇలాంటి మంచి కార్యక్రమంలో అవాస్తవాలకు తావు ఇవ్వొద్దు. ఎవరైనా బలవంతం చేస్తే, దయచేసి సంబంధిత అధికారులకు లేదా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వగలరు. ఇప్పటికే 50,000 మందికి పైగా మార్గదర్శకులు స్వచ్చందంగా నమోదు అయ్యారు. 6లక్షల బంగారు కుటుంబాలు గుర్తించ బడ్డాయి. మార్గదర్శకులు కూడా వారిని దత్తత తీసుకుంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే 250 కుటుంబాలను దత్తత తీసుకొని పీ4 పథకానికే ఆదర్శంగా నిలిచారు.

భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా, ప్రపంచ స్థాయిలో బిలియనర్లు ఎదుగు తున్న దేశంగా గుర్తింపు పొందుతోంది అంతేగాక అధిక శాతం బిలియనర్లు మన దేశస్థులే. అయితే వారితో పాటు అట్టడుగున ఉన్నవారిని ఆర్థికంగా సామాజికంగా మెరుగు పరచాల్సిన బాధ్యత ఆ బిలియనర్ల బాధ్యత. ఇందుకే ప్రభుత్వం వారిని స్వచ్చందంగా ఈ పథకంలో భాగంకావాలని కోరుతోంది. అలాగే పీ4 పథకంలో పాల్గొంటున్న అన్ని ప్రభుత్వాధికారులు కూడా దీన్ని వాలంటరీ ప్రోగ్రామ్ మాత్రమే చూడాలని ఎటువంటి బలవంతం లేకుండా పని చేయాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోందన్నారు.

Read Hindi News : hindi.vaartha.com

Read also : Guinness : గిన్నిస్ రికార్డుల్లో మెగా పిటిఎం – మంత్రి లోకేష్

Andhra Pradesh News AP Development Breaking News in Telugu Infrastructure Planning Latest News in Telugu P-4 Model reconstruction Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.