ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) త్వరలో 2,000 కొత్త బస్సులను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మహిళల ఉచిత ప్రయాణ పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలంటే ప్రస్తుత సదుపాయాలు సరిపోవని, అందుకే బస్సులు, సిబ్బంది పరంగా విస్తరణ అవసరమని ఏపీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు పలిశెట్టి దామోదరావు వెల్లడించారు.
ఉచిత పథకం కోసం సిబ్బందికి అవసరం
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించే పథకానికి వ్యాప్తి ఇవ్వాలంటే పలితంగా దాదాపు 10 వేల మంది సిబ్బంది అవసరం అని ఆయన తెలిపారు. ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్ వంటి నిపుణుల సేవలు తప్పనిసరి కావడంతో వీరి నియామకంపై తక్షణ నిర్ణయం అవసరమని సూచించారు. ఇప్పటికే APSRTC సర్వీసులు చాలా ప్రాంతాల్లో తక్కువగా ఉన్నాయని, ఉచిత ప్రయాణానికి గిరిజన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
యూనియన్ సమావేశంలో కీలక చర్చలు
మంగళవారం విజయవాడలోని APSRTC ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పలిశెట్టి దామోదరావు మాట్లాడారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన పథకాన్ని విజయవంతం చేయాలంటే ప్రణాళికాబద్ధంగా సమృద్ధిగా వాహనాలు, మానవ వనరులు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి వీటి కోసం అవసరమైన బడ్జెట్ కేటాయించాలన్న డిమాండ్‌ను సమావేశం తీర్మానంగా తీసుకుందని యూనియన్ నేతలు తెలిపారు.
Read Also : Kata Amrapali: మళ్లీ తెలంగాణకు ఐఏఎస్ కాట అమ్రపాలి