📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Chandrababu : గోడకు కొట్టిన బంతిలా ప్రతిచర్య తప్పదు – జగన్

Author Icon By Sudheer
Updated: April 10, 2025 • 9:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరిగుతోంది. YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో సమావేశంలో మాట్లాడిన జగన్, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రశ్నించే స్వరం లేకుండా భయపెట్టే వాతావరణాన్ని కలిగిస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది ప్రమాదకరమని హెచ్చరించారు.

‘రెడ్ బుక్ రాజ్యాంగంతో’ చంద్రబాబు దుర్మార్గం

జగన్ ఆరోపణల ప్రకారం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని పార్టీ ‘రెడ్ బుక్ రాజ్యాంగం’తో నడుచుకుంటూ నియమాలన్నీ తుంచిపారేస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి నిర్బంధ రాజకీయాలకు పాల్పడుతుందని జగన్ ఆరోపించారు. ప్రజల ఓట్లతో గెలిచే నైతిక బలం లేకపోవడంతో అణచివేతకు పాల్పడుతున్నారని అన్నారు.

State revenue to grow by 2.2 percent.. CM Chandrababu

ప్రతి చర్యకు ప్రతిచర్య తప్పదు – జగన్ హెచ్చరిక

“గోడకు కొట్టిన బంతిలా ప్రతి చర్యకు ప్రతిచర్య తప్పదు” అని జగన్ గట్టిగా హెచ్చరించారు. దురహంకారంతో, అణచివేతతో ప్రవర్తించే ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ సీట్లు కూడా రావు అనే స్థాయిలో ప్రజలు తీర్పు ఇచ్చేలా సిద్ధమవుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఎప్పుడూ న్యాయపక్షాన నిలుస్తారని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Chandrababu Google News in Telugu Jagan red book

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.