📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Rayapati Sailaja: స్త్రీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్

Author Icon By Pooja
Updated: October 11, 2025 • 12:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినా, సోషల్ మీడియాలో తప్పుగా పోస్ట్ చేసినా కఠిన చర్యలు తప్పవని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ (Rayapati Sailaja) హెచ్చరించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం(International Day of the Girl) సందర్భంగా యూజీసీ ఉమెన్స్ స్టడీ సెంటర్, ఏపీ మహిళా కమిషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ పాతబస్తీ (వన్ టౌన్) లోని కేబీఎన్ కళాశాలలో స్పాట్ లైట్ సెషను శుక్రవారం నిర్వహించారు.

Read Also: Uppal BJYM: ఉప్పల్ బిజెవైఎం నేత రెవల్లి రాజు ఆత్మహత్య

ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన అనంతరం రాయపాటి శైలజ మాట్లాడుతూ చిన్నారులు, బాలికలు, మహిళలు స్వేచ్ఛగా, సంతోషంగా జీవించే హక్కు కలిగి ఉన్నారని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. బాలికలు, మహిళలు చదువుకునే సమయంలో, ఉద్యోగ విధుల్లో ఉన్న సమయంలో ఎటువంటి భయం లేకుండా జీవితం కొనసాగించేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. పని ప్రదేశంలో అఘాయిత్యాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు రాష్ట్ర మహిళా కమిషన్ విధులు, విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రాయపాటి శైలజ సూచించారు. మహిళలు, బాలికలు స్వయంగా తమ కార్యాలయానికి రాలేని పరిస్థితులు ఉండటం, మరొక సందర్భంలో తమ వివరాల గోప్యత వంటి విషయాలను గుర్తించి ఆన్లైన్ పోర్టల్ను సిద్ధం చేస్తున్నామన్నారు.

సదరు పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేస్తే ఆ ఫిర్యాదు స్టేటస్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. చట్టాలపై అవగాహన సదస్సులు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడంతో పాటు విద్యలో ఒక భాగం చేయాలన్న ఆలోచన చేస్తున్నామని రాయపాటి శైలజ(Rayapati Sailaja) తెలిపారు. ముందుగా మారపు ట్రస్ట్ ఛైర్మన్ ఆర్. సుయజ్ రాయపాటి శైలజతో ముఖాముఖి నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, సోషల్ మీడియా వేదికగా వేధింపులు ఇలా పలు అంశాలపై అడిగిన ప్రశ్నలకు రాయపాటి శైలజ విపులంగా సమాధానాలు చెప్పారు. విద్యార్థినీలు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పడంతో పాటు వారిలోని జిజ్ఞాసను ప్రశంసించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Latest News in Telugu Today news Women Empowerment women safety

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.