📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest news: Rayalaseema: రాయలసీమ వారసత్వ స్ఫూర్తిని కవులు సమాజానికి అందించాలి

Author Icon By Tejaswini Y
Updated: December 1, 2025 • 11:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అనంతపురం : రాయలసీమ(Rayalaseema) వారసత్వ స్ఫూర్తిని కవులు కళాకారులు సమాజానికి అందించాలి. రాయలసీమ సమాజం చైతన్యం కోసం కవులు చైతన్య వారధులుగా నిలవాలని రాయలసీమ మహాకవి సమ్మేళనంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన విశ్రాంత ఉపకులపతి ఆచార్య కాడా రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ నేల చారిత్రక, సాంస్కృతిక నెలవైనదని భావితరాలకు ఆ వారసత్వ స్ఫూర్తిని కవులు సమాజానికి అందించాలని ఆయన కోరారు.

Read Also: AP: డిసెంబర్ 1వ తేదీ – ప్రజల సమస్యల పరిష్కారం

రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో డల్లాస్ ఏరియా రాయలసీమ(Rayalaseema) అసోషియేషన్ సౌజన్యంతో అనంతపురం(Anantapur)లోని జిల్లాపరిషత్ ప్రాంగణ సమావేశ మందిరంలో ఆదివారం 180 మంది కవులతో సీమ ప్రసిద్ధ ప్రదేశాలపై రాయలసీమ కవిసమ్మేళనం జరిగింది. రాయలసీమ సాంస్కృతిక వేదిక సమన్వయకర్త డా. అప్పిరెడ్డి, హరినాథరెడ్డి కవి సమ్మేళనాన్ని సమన్వయం చేసారు.

సాహిత్య ప్రముఖులు

ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయితలు బండి నారాయణ స్వామి, శాంతి నారాయణ, ఏలూరి యంగన్న, సడ్లపల్లి చిదంబరరెడ్డి తదితర సాహిత్య ప్రముఖులు, విశ్రాంత ఆచార్యులు లక్ష్మినారాయణరెడ్డి, రవీంద్రారెడ్డి, మానవతా రక్తదాతల బృందం కన్వీనర్ తరిమెల అమరనాథరెడ్డి, రైతుసంఘం నాయకులు శ్రీనివాసరెడ్డి, సీమ ప్రజా సంఘాల నాయకులు వెంకటేష్, రాహుల్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమంలో తమ సందేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్న కవులందరికి నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

anantapur cultural heritage Kavula Sammelanam Poetry Event Rayalaseema Rayalaseema Poets Telugu Literature

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.