ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) డిజిటల్ పరిపాలన దిశగా మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర ప్రజల సౌకర్యార్థం రేషన్ కార్డు సేవలను వాట్సాప్ (WhatsApp) ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకపై పౌరులు తాము అవసరమైన రేషన్ సేవలను సులభంగా మొబైల్‌లోనే పొందగలుగుతారు. ఈ కొత్త సేవల కోసం ప్రభుత్వ అధికారిక వాట్సాప్ నంబర్ 9552300009 కు “HI” అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది.
ఉపయోగించగల సేవలు
వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉన్న 8 రకాల రేషన్ సంబంధిత సేవల్లో దీపం స్థితి, రైస్ డ్రా వివరాలు, eKYC నమోదు, రైస్ కార్డు సమర్పణ, ఆధార్ సీడింగ్, కార్డు విభజన తదితర ముఖ్యమైన సేవలు ఉన్నాయి. వినియోగదారులు “సేవను ఎంచుకోండి” అనే ఎంపిక ద్వారా సివిల్ సప్లయిస్ సేవలు ఎంచుకుని తాము కావాల్సిన సేవను పొందవచ్చు. ఇకపైMeeSeva కేంద్రాలు లేదా రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఈ సేవలు అందుబాటులోకి రావడం ప్రజలకు గణనీయమైన సౌకర్యం.
కొత్త కార్డు దరఖాస్తుకు వీలుకూడా
వాట్సాప్ గవర్నెన్స్ సేవల్లో మరో ముఖ్యమైన అంశం, త్వరలోనే కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇవాళ గానీ రేపు గానీ ఈ ఆప్షన్ యాక్టివ్ అవ్వనుంది. దీంతో కొత్తగా కార్డు కావలసినవారు కూడా ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలో రేషన్ కార్డు సంబంధిత సేవల్లో ఇది ఒక కొత్త అధ్యాయం అని చెప్పవచ్చు.
Read Also : Rohini Karthe : రోహిణి కార్తె ప్రారంభం.. రోళ్లు పగిలే ఎండల్లేవు!