📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Rammohan Naidu: కెనడాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి అరుదైన గౌరవం

Author Icon By Anusha
Updated: September 26, 2025 • 8:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కెనడాలోని మాంట్రియల్‌లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) 42వ జనరల్ అసెంబ్లీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనకు ICAO కౌన్సిల్ ప్రెసిడెంట్ సాల్వటోర్ స్కియాచి, సెక్రటరీ జనరల్ జువాన్ కార్లోస్ సలాజర్తో (Carlos Salazar) ప్రత్యేక సమావేశాలు జరిపే అవకాశం లభించింది. ఈ సమావేశాల వివరాలను ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ (పాత పేరు ట్విట్టర్)లో పంచుకున్నారు.

Satyanarayana:బాలకృష్ణపై బొత్స సత్యనారాయణ  తీవ్ర ఆగ్రహం

మన విమానయాన రంగం ఎంత వేగంగా విస్తరిస్తోంది, ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతోందో ఆయన ఈ సమావేశంలో వివరించారు.రామ్మోహన్ నాయుడు, భారతీయ విమానయాన రంగం సాధించిన అపారమైన ప్రగతిని ప్రస్తావిస్తూ, గ్లోబల్ ఏవియేషన్‌లో భారత్‌ స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి ఐసీఏఓ అందిస్తున్న సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అంతేకాకుండా, ఐసీఏఓ ప్రధాన నినాదం ‘నో కంట్రీ లెఫ్ట్ బిహైండ్’ (ఏ దేశాన్నీ వెనుకబడనివ్వం) అనేది మన ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శక సూత్రం ‘వసుధైవ కుటుంబకం’ (ప్రపంచం ఒకే కుటుంబం)కి సరిగ్గా సరిపోతుందని అన్నారు. ఐసీఏఓ కౌన్సిల్‌లో, ఇతర దేశాలతో సాంకేతిక నైపుణ్యాన్ని పంచుకోవడంలో భారత్‌ మరింత ముందంజలో ఉంటుందని ఆయన చెప్పారు.

Rammohan Naidu

ఇంధనంవైపు తీసుకుంటున్న చర్యలను

మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సమావేశంలో రెండు ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టారు. ఒకటి – సుస్థిరత, రెండు – సమ్మిళితం పర్యావరణ పరిరక్షణ (Environmental protection) కోసం భారతదేశం సుస్థిర విమానయాన ఇంధనంవైపు తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. అంతేకాకుండా, విమానయాన రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి,

లింగ సమానత్వాన్ని తీసుకురావడానికి భారత్ కట్టుబడి ఉందని ఐసీఏఓ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు.ఈ అధ్యయనం ప్రధాన లక్ష్యాన్ని మంత్రి వివరించారు. భారతదేశంలోని విమానాశ్రయాల అభివృద్ధి, వాటి చుట్టుపక్కల వాతావరణానికి అనుగుణంగా ఉండేలా చూస్తుంది. అంతేకాకుండా,

ఈ అధ్యయనం మార్గం సుగమం చేస్తుందని

‘ఏరోట్రోపోలిస్’ లేదా ‘ఏరోసిటీ’ మోడల్స్‌ను సృష్టించడం ద్వారా విమానాశ్రయాలను ఆర్థికాభివృద్ధి కేంద్రాలుగా మార్చడానికి ఈ అధ్యయనం మార్గం సుగమం చేస్తుందని మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. కెనడా ఇండియా బిజినెస్ కౌన్సిల్ (CBIC), కెనడాలోని భారత హైకమిషన్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్‌లో ఇండస్ట్రీ నేతలతో నిర్మాణాత్మక చర్చలో పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

aviation ministry India Breaking News civil aviation India ICAO 42nd General Assembly international aviation Kinjarao Rammohan Naidu latest news Montreal meeting Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.