ఈ మధ్య కాలంలో అన్నెం పున్నెం ఎరుగని బాలికలపై అత్యాచారాల పరంపర నిరాటంకంగా కొనసాగిపోతుండ టం ఈ ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చ, తీవ్ర కళంకం వంటిది. మొన్నటికి మొన్న తిరుపతి జిల్లాలో మూడున్న రేళ్ళ బాలికపై అత్యాచార (Rape of girls)ఘటనను మరువక ముందే సోమవారం నాడు మరో మైనర్ బాలికపై ఓ అత్యంత దారుణమైన ఘట్టం చోటు చేసుకోవడం అనేది ఎంతైనా తీవ్ర ఆందోళన కలిగించే విషయం. తిరుపతి జిల్లా యర్రా వారిపాలెం మండలం యల్లమంద దళితవాడకు చెందిన జెడ్పి హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక పాఠశాల ముగిసిన తరువాత ఇంటికి నడుచుకుంటూ బయలుదేరిన సందర్భంలో వెనుక వైపునుంచి పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు బాలికను అడ్డగించడమే కాదు ఆ బాలికను పొట్టపై కాలితోతన్ని, అపై చాకుతో దాడి చేసి మత్తు మందు కలిపిన నీటిని ఆ బాలికతో తాగించి ఆ తర్వాత ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి ఆ బాలికపై లైంగిక దాడికి(Rape of girls) పాల్పడటం అనేది ఎంతటి దుర్మార్గపు, కిరాతక చర్యో తలుచుకుంటేనే ప్రతి మానవతావాది హృద యం తరుక్కుపోతుంది. వారి గుండెలు జలదరిస్తాయి అనే మాట ఎవ్వరూ కాదనలేని నగ్న సత్యం. అయితే ఈ ఘోర ఉన్మాద ఘటన జరిగిన విషయం ఏమి తెలియని ఆబాలిక తండ్రి పాఠశాల వదిలి సాయంత్రం అవుతున్నా తమకూతు రు ఇంటికి రాకపోవడంతో అతను కంగారుపడి ఆ బాలిక కోసం పాఠశాల అంతా గాలించి ఎక్కడా లేకపోవడంతో వెతకడం (ప్రారంభించి చివరకు గ్రామానికి సమీపంలోని ముళ్లపొదల్లోంచి మూలుగు వినిపించడంతోనే ఏదో కీడు తమ బాలికకు జరిగిందని అనుమానించి తక్షణమే లోనికి వెళ్ళి చూసేసరికి ఆ బాలిక తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉండటాన్ని చూసి ఆ బాలిక తండ్రి అత్యంత తీవ్రంగా చలించిపోయిన తీరుతెన్నులు, ఓ తండ్రిగా ఆయన పడిన ఆవేదన, ఆ బాలికకు ఎదురైనా కడు దయనీయ పరి స్థితి మరే ఆడపిల్ల తండ్రికి కూడా రాకూడదు అనే మాట లో ఎంతో వాస్తవం దాగి వుంది. అదేమాదిరి అన్నెం పున్నెం ఎరుగని ఆ బాలికపై ఏ మాత్రం జాలి, దయ, కరుణ అనేవి ఏ మాత్రం చూపకుండా అత్యంత అమానుషంగా, రాక్షస త్వంతో ఓ క్రూర మృగం కంటే హీనంగా వ్యవహరించిన ఆ ఇద్దరు నరరూప రాక్షసులను, కామాందులను తక్షణమే అరెస్టు చేసి అత్యంత కఠినంగా శిక్షించాల్సిన గురుతర బాధ్యత అటు పోలీసు డిపార్ట్మెంట్ వారిపై, ఇటు న్యాయ శాఖ వారి భుజస్కందాలపై ఎంతైనా వుంది.
Read Also : http://Zika వైరస్ వ్యాప్తి మార్గాలు, చికిత్స, గర్భిణీలకు రిస్క్..
ఏదిఏమైనా మన కేంద్ర ప్రభుత్వం వారు, న్యాయ శాఖ వారు మైనర్ బాలికలపై నిత్యం జరుగుతున్న ఇలాంటి అమానుష అత్యాచార ఘటనలకు, లైంగిక దాడులకు ఎలాగైనా చెక్ పెట్టడానికి, చరమ గీతం పాడేందుకు ఎన్ని కఠినమైన చట్టాలు అమలులోకి తెస్తున్నా అవి బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతుండటం ఈ యావత్ సమాజానికి సంబంధించి చాలా బాధాకరమైన విషయం. ఇలా జరుగడా నికి ప్రధాన కారణం చట్టాలలో వున్న బలహీనతలు, లోనుగులే. ఎందుకంటే వీటిని ఆధారంగా చేసుకొని రేపిస్టులు తమకున్న రాజకీయ పలుకుబడి, పరపతి, డబ్బును ఉప యోగించి తమకు పడే శిక్షల నుంచి తప్పించుకొని యధేచ్చ గా బయటపడుతుండటం కూడా ఇలాంటి క్రూర లైంగిక దాడులు పదే పదే జరుగడానికి కారణభూతమవుతున్నాయి అనే మాట అక్షర సత్యం. ఏమైనా ఇప్పటికైనా మన కేంద్ర ప్రభుత్వం వారు, పోలీసు, న్యాయశాఖ వారు మరింతగా అప్రమత్తంగా, అత్యంత బాధ్యతా యుతంగా వ్యవహరించి బాలికలపై లైంగిక దాడులకు పాల్పడే వారిలో ఏ ఒక్కరూ కూడా చట్టం నుంచి తప్పించు కోకుండా వారికి కఠిన కారా గార శిక్షలు అమలు అయ్యేలా అత్యంత చిత్తశుద్ధితో, ఎనలేని అంకితభావంతో వారు అవిరళ కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అలా చేయకపోతే మాత్రం ఆడపిల్లలను కన్న ప్రతి తల్లిదండ్రులు కూడా బడి ఈడు వచ్చిన తమ బాలి కలను పాఠశాలలకు పంపించాలంటేనే తీవ్ర భయాందోళ నకు గురయ్యే పరిస్థితులు ఉత్పన్నం అవ్వడం తథ్యం అనే మాట సత్య దూరం కాదు. ఎందుకంటే బాలికలపై ఇలాంటి కిరాతక, పైశాచిక చర్యలు పదే పదే జరగడం మూలాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యావత్తు ప్రజలు ఇది ప్రజాస్వా మ్యమా? లేక ఆరాచకస్వామ్యమా? అని తమలో తాము ప్రశ్నించుకుంటారు అనడంలో ఎలాంటి సందేహానికి తావు లేదు.
మానవత్వం వర్ధిల్లాలి! రాక్షసత్వం నశించాలి!.
-బి. మధుసూదనరెడ్డి
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: