ఆన్‌లైన్‌లో(Ranveer Allahbadia) ప్రచురించే కంటెంట్‌కు స్పష్టమైన బాధ్యత అవసరమని సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం యూట్యూబ్ ఛానల్ లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఉన్నంత మాత్రాన బాధ్యతారాహిత్యంగా వ్యవహరించేందుకు హక్కు లేనందును ధర్మాసనం స్పష్టం చేసింది. యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియాతో సంబంధం ఉన్న వివాదంపై గురువారం విచారణ కొనసాగుతుండగా, ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.
Read also: సిగరెట్లు సంఖ్యను తగ్గిస్తే చాలదు ..
కంటెంట్ నియంత్రణకు కొత్త నిబంధనలు తప్పనిసరి: ధర్మాసనం ఆదేశాలు
ఓ కామెడీ షోలో పాల్గొన్న వ్యక్తిని తల్లిదండ్రులు, శృంగారంపై అసభ్యకర ప్రశ్నలు అడిగిన ఘటన రణ్‌వీర్ అలహాబాదియాపై వివాదం రేకెత్తించింది. ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం అసభ్య కంటెంట్ అప్‌లోడ్ చేస్తే అది వైరల్ అవుతుంది, లక్షల మంది చూస్తారు. అలాంటి పరిస్థితుల్లో నియంత్రణ ఎలా? అని ప్రశ్నించింది. దేశ(Ranveer Allahbadia) వ్యతిరేక లేదా అసందర్భమైన కంటెంట్‌ను అప్‌లోడ్ చేసినప్పుడు ఆ క్రియేటర్‌పై బాధ్యత ఎలా ఉంటుందన్న విషయంలో కూడా కోర్టు స్పష్టత కోరింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ ఇది కేవలం అశ్లీలత సమస్య కాదని, యూజర్లు సృష్టించే కంటెంట్‌లోని లోపాలను బయటపెడుతున్న అంశమని చెప్పారు. భావప్రకటన స్వేచ్ఛను తప్పుగా అర్థం చేసుకోవద్దని ఆయన సూచించారు.
ఆన్‌లైన్ కంటెంట్‌పై పర్యవేక్షణ వ్యవస్థ ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు ఎలా జరుగుతున్నాయని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. సోషల్ మీడియా వినియోగదారులు సృష్టించే కంటెంట్‌ను నియంత్రించేందుకు స్పష్టమైన, కఠినమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది. ఇందుకు నిబంధనల రూపకల్పనకు కేంద్రానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: