📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Rangaraya Medical College: ల్యాబ్ టెక్నీషియన్లు నలుగురు సస్పెన్షన్

Author Icon By Anusha
Updated: July 12, 2025 • 11:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రంగరాయ వైద్యకళాశాలలో లైంగికవేధింపుల కేసు

క్రిమినల్ కేసులు నమోదు చేసిన పోలీసులు

కాకినాడ: కాకినాడ జిల్లా రంగరాయ వైద్య కళాశాల పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపుల సంఘటనలో నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లు ను విధుల నుండి సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేసామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి (District Collector Shan Mohan Sagili) తెలిపారు. శుక్రవారం మద్యాహ్నం కలెక్టరేట్ వివేకానంద హాలులో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి. బిందుమాధవ్ సంయుక్తంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రంగరాయ వైద్య కళాశాలలో పారామెడికల్ విద్యార్థినుల నుండి లైంగిక వేదింపులు అంశంపై అందిన ఫిర్యాదుపై తీసుకున్న చర్యలు, అటువంటి సంఘటనలు విద్యాసంస్థలు, మహిళలు పనిచేసే ప్రదేశాలలో పునరావృతం కాకుండా చేపట్టిన చర్యలను గురించి వివరించారు.

ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ

ఈ నెల 9వ తేదీన రంగరాయ వైద్య కళాశాలలో బిఎస్సీమెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ కోర్సు చదువుతున్న 60 మంది విద్యార్థులు కళాశాలలో లాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వి.కళ్యాణ చక్రవర్తి తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడని ఈ మెయిల్ ద్వారా కళాశాల ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసారన్నారు. దీనిపై ఆర్ఎంసి ప్రిన్సిపాల్ వెంటనే స్పందించి ఈ ఫిర్యాదును లైంగిక వేధింపుల నిరోధానికి కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ (Internal Complaints Committee) విచారణకు అప్పగించారని, ఈ కమిటీ 9,10 తేదీలలో బిఎస్సీ ఎంఎల్టీ కోర్స్ చదువుతున్న 60 మంది విద్యార్థులు, నిందిత ఉద్యోగుల లను విచారించి, అందరి వాంగ్మూలాలు, రుజువులను నమోదు చేసిందన్నారు.

ఆరోపణలు

విచారణ సందర్భంగా 55మంది విద్యార్థినులు, నిందితుడు కళ్యాణ చక్రవర్తితో పాటు, మరో ముగ్గురు లాబ్ టెక్నీషియన్లు ఎస్. గోపాలకృష్ణ, బి. జిమ్మిరాజు, జివిఎస్ ప్రసాదరావులు కూడా తమపై లైంగిక వేధింపులకు, అనుచిత ప్రవర్తనకు పాల్పడ్డారని తెలిపారన్నారు. కమిటీ విచారణలో ఫిర్యాదులోని ఆరోపణలు నిజమని 55మంది విద్యార్థినులు తెలియజేసారని, రుజువుల పరిశీలనలో కూడా లైంగిక వేదింపులు, అశ్లీల మెస్సేజులు, అనుచిత ప్రవర్తన జరిగినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా నలుగురు నిందిత ఉద్యోగులను రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సస్పెండ్ చేసి, వారిపై స్థానిక వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా, శుక్రవారం మద్యాహ్నం వారందరినీ అరెస్ట్ చేయడంజరిగిందని, వీరిపై చట్టపరమైన చర్యలుచేపట్టడం జరుగుతుందన్నారు.

Rangaraya Medical College: ల్యాబ్ టెక్నీషియన్లు నలుగురు సస్పెన్షన్

మరింత బలోపేతం

ఈ సంఘటనలో తమపై జరుగుతున్న లైంగిక వేదింపులపై ధైర్యం ముందుకు వచ్చి ఫిర్యాదు చేసిన విద్యార్థినులను, ఫిర్యాదుపై తక్షణ విచారణ నిర్వహించి వారిలో వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని నింపిన ఆర్ఎంసి ప్రిన్సిపాల్, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఆర్ఎంసి సంఘటన లో విద్యార్థినులు, పనిచేసే మహిళలపై లైంగిక అకృత్యాలను నిరోధించేందుకు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళశాలలు, కార్యాలయలలో మహిళల రక్షణకు ఏర్పాటైన అంతర్గత కమిటీలను మరింత బలోపేతం చేసి చైతన్య పరుస్తామని తెలిపారు.విద్యార్థినులు, పనిచేసే మహిళలకు లైగింక వేదింపులు ఎదురైతే
నిర్భయంగా ఈ కమీటీలకు గాని, తనకు గానీ తెలియజేయాలని, ఫిర్యాదుదారుల పేర్లు గోప్యంగా ఉంచి, నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత సెక్షన్ల ప్రకారం వారిపై చర్యలు

జిల్లా ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ ఆర్ఎంసీ సంఘటనలో పోలీస్ స్టేషన్లలో శుక్రవారం ఉదయం ఫిర్యాదు నమోదు కాగా, నేరారోపితులు నలుగురిని మద్యాహ్నం రెండున్నర లోపు అరెస్ట్ చేయడం జరిగిందని, సంబంధిత సెక్షన్ల ప్రకారం వారిపై చర్యలు గైకొనడం జరుగుతుందన్నారు. బాలికలు, మహిళల రక్షణకు చేపట్టిన చర్యల్లో భాగంగా పోలీస్ శాఖ ..శక్తి యాప్.. ను అందుబాటులోకి తెచ్చిందని, విద్యార్థినులు, వర్కింగ్ ఉమెన్ (Working woman) తమ పట్ల జరిగే అకృత్యాల నుండి రక్షణ పొందేందుకు ఈ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే శక్తి యాప్ గురించి బాలికలు, మహిళలందరికి తెలియజేసి అవసర సమయాల్లో వినియోగించుకునేలా చైతన్య పరచాలని మీడియాను కోరారు. ఈ సమావేశంలో రంగారాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఏ. విష్ణువర్ధన్, జిజిహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ డా.పి.శ్రీనివాసన్, ఆర్ఎంసి పారామెడికల్ కోర్సుల కో ఆర్డినేటర్ డా.కె.సతీష్ పాల్గొన్నారు.

రంగరాయ మెడికల్ కాలేజీ స్థాపకులు ఎవరు?

రంగరాయ మెడికల్ కాలేజీ స్థాపనకు డా. ఎం.వి. కృష్ణారావు, కర్నల్ డా. డి.ఎస్. రాజు ప్రధాన పాత్ర పోషించారు.

రంగరాయ మెడికల్ కాలేజీలో ఎన్ని MBBS సీట్లు ఉన్నాయి?

రంగరాయ మెడికల్ కాలేజీ, కాకినాడలో ప్రతి సంవత్సరం 250 MBBS సీట్లు ఉన్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Read Also: Vijayasai Reddy: ఈరోజు సిట్ విచారణకు హాజరవుతున్న విజయసాయిరెడ్డి

Andhra Pradesh government action Breaking News Kakinada news lab technicians suspended latset news paramedical students harassment Rangaraya Medical College Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.