News Telugu: Ramoji rao: రామోజీరావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన చంద్రబాబు

Read Time:  1 min
Ramoji rao
Ramoji rao
FONT SIZE
GET APP

జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. రామోజీరావు (Ramoji rao) దేశంలో మీడియా రంగానికి అందించిన సేవలు అపూర్వమని, ఆయన చూపిన దారి ఇప్పటికీ జర్నలిజానికి ఆదర్శమని సీఎం పేర్కొన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, రామోజీరావు నిష్పక్షపాత్యానికి ప్రతీక అని, ఆయన స్థాపించిన ఈనాడు సంస్థలు తెలుగు ప్రజల జీవితాలపై ఎంతో ప్రభావం చూపినట్లు పేర్కొన్నారు.

Read also: CII summit 2025: ఏపీలో పెట్టుబడి పెట్టనున్న Hwaseung కంపెనీ

Ramoji rao

Ramoji rao: రామోజీరావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన చంద్రబాబు

దూరదృష్టి కలిగిన నాయకుడు

సమాజం, రాజకీయాలు, ప్రజా సమస్యలను నిక్కచ్చిగా ప్రజల ముందుకు తీసుకురావడంలో రామోజీరావు కీలకపాత్ర పోషించారని అన్నారు. జర్నలిజంతో పాటు వ్యాపార రంగంలో కూడా నైతికత, నీతి, విలువలను కాపాడుతూ ముందుకు సాగిన దూరదృష్టి కలిగిన నాయకుడు రామోజీరావు అని చంద్రబాబు అభివర్ణించారు. ఆయన చూపిన మార్గం కొత్త తరాలకు స్ఫూర్తిదాయకమని, రామోజీ సిద్ధాంతాలు ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.