TTD Scam: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Ramanarayana Reddy), గత వైసీపీ ప్రభుత్వ కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని తీవ్రంగా మండిపడ్డారు. టీటీడీ(Tirumala Tirupati Devasthanams) వ్యవస్థపై అప్పటి ప్రభుత్వం మాఫియా తరహాలో నియంత్రణ చెలాయించిందని ఆయన పేర్కొన్నారు. పరకామణి హుండీ లెక్కింపులో జరిగిన భారీ లోపాలను గత ప్రభుత్వం కావాలనే పట్టించుకోకుండా కేసును దారి మళ్లించిందని ఆరోపించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలో కూడా భక్తులను దారుణంగా మోసగించారని విమర్శించారు.
Read Also: Tirumala: నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల
గత ఐదేళ్లలో భారీ దోపిడీ
లోక్ అదాలత్‌లో వివాదాస్పద కేసులను సులభంగా రాజీకి తెచ్చిన నేపథ్యంలో భారీ కుంభకోణం దాగి ఉందని ఆనం వ్యాఖ్యానించారు. చిన్న మొత్తాలు దోచుకున్న వ్యక్తులు అకస్మాత్తుగా కోట్లాది రూపాయల ఆస్తులు ఎలా కూడబెట్టారన్న అనుమానాలు ఉన్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులను, పోలీసుల సహకారంతో కొందరి ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్న సంఘటనలు కూడా జరిగినట్లు ఆరోపించారు.
టీటీడీలో విచిత్ర ఘటన
జగన్ పాలనలో టీటీడీలో నెయ్యి తయారీపై జరిగిన విచిత్రమైన సంఘటనలను ప్రస్తావిస్తూ, “పాలు లేకుండా నెయ్యి తయారు చేసిన ఘనత కూడా గత ప్రభుత్వానిదే” అని ఆనం వ్యంగ్యంగా అన్నారు. ఈ ఘటన టీటీడీ వ్యవస్థలు ఎంతగా దెబ్బతిన్నాయో చూపించే ఉదాహరణ అని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం మీద గత ఐదేళ్లలో భారీగా నిధులు దోచుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
జగన్ తన సన్నిహితులను టీటీడీ బోర్డు ముఖ్య బాధ్యతలపై నియమించడం కూడా అనేక అనుమానాలకు దారి తీసిందని ఆనం((Ramanarayana Reddy)) తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం టీటీడీలో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు కట్టుబడి ఉందని, భక్తుల నమ్మకాన్ని తిరిగి నిలబెట్టే దిశగా చర్యలు ప్రారంభించామని మంత్రి స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: