📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Telugu news: Ram Mohan Naidu: ఏపీలో ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై కేంద్రం శుభవార్త

Author Icon By Tejaswini Y
Updated: December 16, 2025 • 5:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bhogapuram International Airport: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత కీలకంగా అభివృద్ధి చెందుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) కీలక ప్రకటన చేశారు. మరో ఆరు నెలల్లో ఈ విమానాశ్రయం విమాన రాకపోకలతో ప్రజలకు అందుబాటులోకి రానుందని ఆయన స్పష్టం చేశారు.

Read Also: Amaravati: విజయవాడలో ఐటీ హబ్‌గా మారే ఏరియాలు ఏవంటే?

2026 మేలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను 2026లో ప్రారంభించాలనే లక్ష్యంతో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. తొలుత 2026 జూన్ నాటికి విమానాశ్రయాన్ని ప్రారంభించాలని భావించినప్పటికీ, పనులు ఆశించిన దానికంటే వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో మే నెలలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం తుది దశకు చేరుకుందని చెప్పారు.

Ram Mohan Naidu: Good news from the Center on airport development in AP

విజాగ్‌కు మరో మైలురాయి

విశాఖపట్నంలో జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ప్రాజెక్టు(GMR Manassas Aviation Education City Project) ఒప్పంద కార్యక్రమంలో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు, ఈ ఒప్పందం చరిత్రాత్మకమని అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు ద్వారా భోగాపురం విమానాశ్రయం అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు.

చంద్రబాబు విజన్ ఫలితం

పౌర విమానయాన రంగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి అన్నారు. అలాగే ఏవియేషన్ రంగంలో నైపుణ్య శిక్షణకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని, అనేక విద్యాసంస్థలు, యూనివర్సిటీల స్థాపనకు ఇది దోహదం చేస్తుందని తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఏవియేషన్ రంగాలను సమన్వయంగా అభివృద్ధి చేస్తూ ఉత్తరాంధ్రను ప్రపంచ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. భోగాపురం విమానాశ్రయం, ఏవియేషన్ ఎడ్యు సిటీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాళ్లుగా నిలుస్తాయని, వలసలను తగ్గించి ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Airports Bhogapuram Airport Latest News Bhogapuram International Airport Civil Aviation Minister ram mohan naidu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.