📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Ram Mohan Naidu: కొత్త రైల్వేహాల్ట్ తో మరింత అభివృద్ధి

Author Icon By Saritha
Updated: March 21, 2026 • 12:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ram Mohan Naidu: శ్రీకాకుళం జిల్లాలో రైల్వే వ్యవస్థను మరింత విసృత పరుస్తామని కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం నాడు జిల్లాలోని కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ లో విశాఖ గుణపూర్ పాసింజర్ రైలు హాల్ట్ ను రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తో కలసి ప్రారంభించారు. అదేవిధంగా మందస రోడ్ రైల్వే స్టేషన్ లో బెర్హంపూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ను కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. పాతపట్నంలో రోర్కెల గుణపూర్ రాజ్యరాణి ఎక్స్ప్రెస్ల నూతన హాల్టు ను స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావులతో కలసి ప్రారంభించారు. అంతకు ముందు మూడు చోట్ల ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు.

Read Also : Assam Elections Update: అస్సాం అసెంబ్లీ ఎన్నికలు: అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన టీఎంసీ

Ram Mohan Naidu: Further development with new railway halt

Ram Mohan Naidu: మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు

హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి హామీ ఇచ్చి కొద్ది రోజుల్లోనే హాల్ట్ మంజూరు అయ్యేలా కృషి చేసిన రామ్మోహన్ నాయుడుకు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్రుతలు తెలిపారు. ఇంకా మరిన్ని సర్వీసులు అందుబాటులోకి వచ్చేలా చెయ్యాలని కోరారు. హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్కు చేరుకునే అప్రోచ్ రోడ్లను విస్తృతం చెయ్యాలని కోరారు. అదే విధంగా నందిగాం రౌతుపురంలో రోడ్డు అభివృద్ధి, టెక్కలిలో ఉన్న రైలు గేటును డబుల్ గేట్గా విస్తృత పరచాలని అచ్చెన్నాయుడు కోరారు. దీనిపై రైల్వే అధికారులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టి సారించాలన్నారు.

రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై రామ్మోహన్ నాయుడు ప్రసంగం

అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సభ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడారు. హరిశ్చంద్రపురం రైల్వేస్టేషన్లో ట్రైన్ హాల్ట్ కోసం విశేష ప్రయత్నం చేశామని ఉగాది పర్వదినం సమీపంలో అది సాకారం అవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సర్వీస్ ద్వారా స్థానిక రైతులకు, మహిళలకు, విద్యార్థులకు మరింత ఉపయుక్తంగా మారనుందని అన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, గుణపూర్ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ అభివృద్ధికి హద్దులు చెరిపేస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు అన్నారు. హరిశ్చంద్రపురం స్టేషన్లో ఇరవై ఏళ్ళ క్రితం ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది అనే తేడాను ప్రజలు గమనించాలని అన్నారు.

జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హరిశ్చంద్ర పురంలో అభివృద్ధి చేస్తే స్థానికంగా విశేష ఉపాధి వనరులు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ప్లాట్ ఫాం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, స్టాపేజి.. ఇలా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. స్టేషన్ ను ఆనుకుని రైల్వే పరిధిలోని 40 ఎకరాలను సైతం అభివృద్ధి చేస్తామని, తద్వారా ఉపాధి అందుతుందని తెలిపారు. వేర్ హౌస్, గూడ్స్ షెడ్, కంటైనర్ టెర్మినల్ లాంటి వాటిని ఇక్కడ ఏర్పాటు చేస్తామని అన్నారు. స్థానిక ప్రజలు కూడా నూతన హాల్ట్ సర్వీసులను ఎక్కువగా ఉపయోగించుకోవాలని కోరారు. రైల్వే జోను విశాఖలో త్వరలో ప్రారంభిస్తామని ఇకపై మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు కార్యరూపం దాల్చుతాయని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర అభివృద్ధి పనుల కు హామీ

మంత్రి అచ్చెన్నాయుడు కోరిన అభివృద్ధి పనులు కూడా అతి త్వరలో చేరువ చేస్తామని హామీ ఇచ్చారు. చాలామంది లీడర్లు కేంద్ర ప్రభుత్వ స్థలంలో అభివృద్ధికి కేంద్రం నిధులపై ఆశపడతారని కానీ అచ్చెన్నాయుడు అందుకు భిన్నంగా అనుమతులు మీరివ్వండి అభివృద్ధి మేము చేసుకుంటామని అనడం ఆయనకు మాత్రమే చెందిందని కితాబిచ్చారు. పోర్టు ఏర్పాటు ద్వారా అటు రాయ్ పూర్ నుండి ఇటు ఒడిశా వరకు అభివృద్ధి జరుగుతుందని అన్నారు. సాల్ట్ భూముల సమస్యను పరిష్కరించామని అన్నారు. అభివృద్ధి చేస్తూ ఉన్నామని కంపెనీలు రావడమే ఆలస్యం అని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాల హామీతో కూటమి సర్కారు ఉపాధి దిశగా బలమైన అడుగులు వేస్తోందని అన్న రామ్మోహన్ నాయుడు అందుకు ఉత్తరాంధ్రలో కూడా సమాన ప్రాధాన్యత దక్కుతుందని ఆనందం వ్యక్తం చేశారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ భావాన్ని మరింతగా విస్తృత పరుస్తున్నామని తెలిపారు. ప్రపంచం ఇప్పుడు భారత దేశం వైపు చూస్తుంటే.. భారత్ వచ్చిన సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉండటం శుభపరిణామం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Atchennaidu Harishchandrapuram Railway Station Kinjarapu Ram Mohan Naidu Mandasa Road Station Passenger Halt Srikakulam Railway Development

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.