📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ram Mohan Naidu: పలాస కేంద్రీయ విద్యాలయలో తరగతులు షురూ!

Author Icon By Saritha
Updated: March 14, 2026 • 10:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ram Mohan Naidu: శ్రీకాకుళం జిల్లా, పలాసలో కేంద్రీయ విద్యాలయ తరగతులు 2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రారంభం అవుతున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇందుకు సంబంధించి కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రీయ విద్యాలయ సంగతాన్ నుండి శుక్రవారం అధికారిక ఉత్తర్వులు వెలువడినట్లు తెలిపారు. ఆ ఉత్తర్వుల ప్రకారం కేంద్రీయ విద్యాలయ పాఠశాలను పలాసలో ఏర్పాటుకు గత సంవత్సరం అక్టోబర్ మూడవ తేదిన అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు.

Read Also: AP 10th Exams 2026: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన రద్దు!

Ram Mohan Naidu: Classes Begin at Kendriya Vidyalaya, Palasa!

ఫలించిన రామ్మోహన్ నాయుడు కృషి

తరువాత పాఠశాల ఏర్పాటుకు అవసరమైన భూములు, ఇతర భవనాలు, వసతుల కోసం పలు కమిటీలు క్షేత్ర స్థాయి పరిశీలనలు చేసినట్టు పేర్కొన్నారు. భూముల బదలాయింపు, తాత్కాలిక తరగతుల నిర్వహణ కోసం వసతుల పరిశీలన పూర్తిగా జరిగిన నేపధ్యంలో రాబోయే విద్యా సంవత్సరం 2026-27 తరగతుల నిర్వహణ ప్రారంభిస్తు న్నట్టు ఉత్తర్వులలో స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఒకటి నుండి అయిదవ తరగతి వరకు ప్రతీ తరగతికి ఒక సెక్షన్ చొప్పున ప్రవేశాలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఇదివరకే స్థానిక అధికారులతో కలసి ఈ ఏడాది ఫిబ్రవరి 17న పలాస రైల్వే కాలనీలోని ఆర్.పి.ఎఫ్ బారక్స్ ను కేంద్ర పౌర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలన చేసి అవసరమైన సూచనలు చేశారు. విమానయాన రైల్వే అధికారులతో మాట్లాడి వారి నుండి కేంద్రీయ విద్యాలయకు గదుల బదిలీకి శాఖాపరమైన ప్రక్రియ వేగవంతం చెయ్యాలని స్పష్టం చేశారు. అనంతరం నెమలికొండ ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయ ప్రతిపాదిత స్థలాన్ని సైతం క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు.

జిల్లా వాసుల హర్షం

తాజాగా తరగతుల నిర్వహణకు ఉత్తర్వులు విడుదలైన నేపధ్యంలో రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస పరిసర ప్రాంతాల వారితో పాటు జిల్లాలోని సాయుధ దళాల సిబ్బందికి, కేంద్ర సంస్థల ఉద్యోగులకు పలాసలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు ద్వారా పిల్లలకు నాణ్యమైన విద్యా అవకాశాలు లభిస్తాయని అన్నారు. కాగా రామ్మోహన్ నాయుడు చొరవతో ఇప్పటికే ఒక కేంద్రీయ విద్యాలయ ఉన్న శ్రీకాకుళం జిల్లాలో స్థానికులకు సేవలధించేందుకు వీలుగా పలాసలో మరొకటి ఏర్పాటు కాబోతుండటం ఈ విద్యా సంవత్సరం నుండి తరగతులు సైతం ప్రారంభం కాబోతుండటం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Kendriya Vidyalaya Sangathan Latest News in Telugu Palasa KV School ram mohan naidu Srikakulam Education Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.