📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest News: Gollapalli Amulya: భర్తపై రాజోలు టీడీపీ ఇంఛార్జ్ గొల్లపల్లి అమూల్య ఫిర్యాదు

Author Icon By Aanusha
Updated: October 28, 2025 • 10:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో మరో వివాదం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ మహిళానేత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ ఇంఛార్జ్ గొల్లపల్లి అమూల్య (Gollapalli Amulya), భర్త అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. ఈ ఘటనతో టీడీపీ నేతలు, స్థానిక రాజకీయ వర్గాలు, ప్రజల్లో చర్చ నడుస్తోంది.

Read Also: AP LRS: ఏపీలో LRS గడువు పొడిగింపు

గొల్లపల్లి అమూల్య (Gollapalli Amulya) రాజోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం — దొమ్మేటి సునీల్ అనే వ్యక్తి ఆమె భర్త. చదువుకునే రోజుల్లో సునీల్ తన స్నేహితుడిగా పరిచయం అయ్యి, ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పెద్దల సమక్షంలో 2009 మార్చి 4న వివాహం చేసుకున్నాడు.

కానీ పెళ్లి తర్వాత పరిస్థితులు మారిపోయాయి. భర్త సునీల్ తరచుగా తనపై ఒత్తిడి తెస్తూ, అదనపు వరకట్నం కోసం వేధించాడని అమూల్య ఫిర్యాదులో పేర్కొన్నారు.సునీల్ తనపై రెండుసార్లు హత్యాయత్నం చేశాడని.. తన ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 Gollapalli Amulya

తనకు, పిల్లలకు ప్రాణహాని ఉందని

తన భర్త సునీల్ నుంచి తనకు, పిల్లలకు ప్రాణహాని ఉందని.. తల్లిదండ్రుల వద్ద నుంచి డబ్బులు తీసుకురావాలని భర్త వేధిస్తున్నారని ఆరోపించారు.

అమూల్య ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టీడీపీ నేతపై వేధింపులు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.. ఈ వ్యవహారంపై అమూల్యతో పాటుగా రాజోలు పోలీసులు స్పందించాల్సి ఉంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Gollapalli Amulya latest news Rajolu TDP leader Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.