📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Rajiv Kumar Meena: కానిస్టేబుల్ రాత పరీక్షా ఫలితాలు విడుదల

Author Icon By Anusha
Updated: July 12, 2025 • 12:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎపిఎస్ఎల్పిఆరిబి చైర్మన్ రాజీవ్ కుమార్ మీనా

విజయవాడ : పోలీసు కానిస్టేబుల్స్ నియామకాల కోసం రాత పరీక్షలో 33,921 మంది ఎంపికైనట్లు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు రాజీవ్ కుమార్ మీనా (Rajiv Kumar Meena) తెలిపారు. గత నెల 1వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 37,600 మంది హాజరవగా, వీరిలో పురుషులు 32,364 మంది, మహిళలు 5,236 మంది ఉండగా, ఎంపికైన వారిలో పురుషులు 29,211 మంది, మహిళలు 4,710 మంది ఉన్నారని గురువారం విడు దల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా విశాఖపట్నం కేంద్రంలో 10,354, కాకినాడ కేంద్రంలో 5,502, గుంటూరు కేంద్రంలో 7,323, 6,320, తిరుపతి కేంద్రంలో 4,417 మంది ఎంపికయ్యారని వెల్లడించారు. అభ్యర్థులు వారి మార్కుల జాబితాల కోసం https://slprb.ap.gov.in/UI/index వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.

Rajiv Kumar Meena: కానిస్టేబుల్ రాత పరీక్షా ఫలితాలు విడుదల

చెల్లించిన ఫీజును

అభ్యర్థులు వారి ఒఎంఆర్ షీట్లను పరిశీలించు కునేందుకు ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకూ వెబ్సైట్లో (Website) అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఒఎంఆర్ వెరిఫికేషన్ కోసం ఈ నెల 12వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతోపాటు రూ.వెయ్యి ఫీజు చెల్లించాలని తెలిపారు. వెరిఫికేషన్లో మార్కులు పెరిగితే చెల్లించిన ఫీజును అభ్యర్ధికి వెనక్కి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫలితాల వివరాలను ఎస్ఎంఎస్, ఇమెయిల్ (E-Mail) ద్వారా పంపనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం, 94414 50639 లేదా 91002 03323 నంబర్లకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల లోపు సంప్రదించవచ్చని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎవరు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు విభాగానికి కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా హరీష్ కుమార్ గుప్తా సర్ బాధ్యతలు స్వీకరించారు.

డీజీపీ (Director General of Police) జీతం ఎంత?

భారతదేశంలో డీజీపీ (DGP) స్థాయి అధికారి జీతం సుమారుగా ప్రతి నెలకు ₹2,25,000 ఉంటుంది. ఇది ఒక రాష్ట్ర పోలీస్ విభాగంలో ఐపీఎస్ అధికారికి లభించే అత్యున్నత హోదా.

Read hindi news: hindi.vaartha.com

Read Also: East Godavari District: లోకాయుక్త జోక్యంతో లైబ్రరీ సెస్ వసూలు

Andhra Pradesh Police Recruitment Board AP Constable written test AP Police Constable Results 2025 AP police selected candidates list Breaking News Rajiv Kumar Meena Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.