📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Buggana : సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

Author Icon By Sudheer
Updated: March 9, 2026 • 10:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డోన్ పర్యటనలో తనపై చేసిన భూకబ్జా ఆరోపణలను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదును ఆధారం చేసుకుని, వాస్తవాలు తెలుసుకోకుండా తనపై నిందలు వేయడం ముఖ్యమంత్రి స్థాయికి తగదని ఆయన హితవు పలికారు. సభలో పిటిషన్ ఇచ్చిన వ్యక్తి సమస్య పూర్తిగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి తగాదా అని, అందుకే రెండేళ్లుగా ఏ అధికారి కూడా దానిని పరిష్కరించలేకపోయారని బుగ్గన వివరణ ఇచ్చారు. స్వయంగా ఆర్డీవో (RDO) ఆ భూమి ‘అసైన్డ్ భూమి’ అని, ఫిర్యాదుదారునికి దానితో సంబంధం లేదని చెబుతున్నా, చంద్రబాబు ఆ మాటలను పట్టించుకోకుండా అధికారులను ‘బుల్డోజ్’ చేయడం రాజకీయ కక్షసాధింపు చర్యేనని ఆయన మండిపడ్డారు. మీకు బాధితుడికి న్యాయం చేయడం ముఖ్యామా లేక ప్రతిపక్షంపై బురద చల్లడం ముఖ్యామా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

Read Also : AP MLAs: దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

తన కుటుంబ నేపథ్యాన్ని మరియు ఆస్తుల వివరాలను ప్రస్తావిస్తూ బుగ్గన భావోద్వేగపూరితమైన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబం వందేళ్ల క్రితం ఏ ఇంట్లో ఉందో, ఈ రోజు కూడా అదే ఇంట్లో నివసిస్తోందని.. తమకు ఇతరుల ఆస్తులపై ఆశ లేదని ఆయన స్పష్టం చేశారు. పైగా తమకున్న ఆస్తుల్లో 75 శాతం ప్రజల కోసం దానం చేసిన చరిత్ర తమదని, ఆ దానాల జాబితా చూడాలంటే ముఖ్యమంత్రికి ఒక రోజంతా పడుతుందని సవాల్ విసిరారు. వందేళ్ల క్రితం చంద్రబాబు కానీ, ఆయన అనుచరులు కానీ ఎక్కడ ఉన్నారో చెప్పగలరా అని ప్రశ్నిస్తూ, తనపై వచ్చిన ఆరోపణలపై నిజనిర్ధారణ కోసం కలెక్టర్‌ను ఆదేశించాలని డిమాండ్ చేశారు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని, అధికార బలంతో అధికారుల గొంతు నొక్కడం సరైన పద్ధతి కాదని బుగ్గన ఈ సందర్భంగా హెచ్చరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

BugganaRajendranath Chandrababu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.