📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Montha Cyclone : తుఫాన్ పోయిన..ముసురు పోలేదు

Author Icon By Sudheer
Updated: October 29, 2025 • 10:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శనివారం దాటిన మొంథా తుఫాను పూర్తిగా తగ్గిపోయినప్పటికీ, దాని ప్రభావం ఇంకా ఏపీ రాష్ట్రంపై కొనసాగుతూనే ఉంది. గురువారం కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు దట్టంగా నమోదయ్యే వీలుంది. చెరువులు, వాగులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని సూచనలు ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరో రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాల్సిందేనని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Latest News: Donald Trump: మోదీ చాలా కఠినమైన వ్యక్తి: ట్రంప్

మొంథా తుపాను శాంతించిన నేపథ్యంలో, ప్రభుత్వం తుపాను అనంతర చర్యలపై దృష్టి కేంద్రీకరించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, పునరుద్ధరణ పనులను సమీక్షించారు. ప్రభావిత గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్, శానిటేషన్ కార్యక్రమాలు అత్యవసరమని పేర్కొన్నారు. తాగునీరు సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. తుపాను వల్ల దెబ్బతిన్న రహదారులను తక్షణమే మరమ్మతు చేసి, రవాణా వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అధికారుల నివేదిక ప్రకారం..మొంథా తుపాను మొత్తం 1583 గ్రామాలను తీవ్రమంగా ప్రభావితం చేసింది. 38 ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతినగా, మరో 125 చోట్ల రహదారుల్లో లోతైన గుంతలు ఏర్పడ్డాయి. శానిటేషన్ సిబ్బందిని పూర్తి స్థాయిలో మొబిలైజ్ చేశామని, తాగునీటి ట్యాంకుల వద్ద క్లోరినేషన్ పని యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని అధికారులు వివరించారు. పవన్ కళ్యాణ్ ప్రజల ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని స్పష్టం చేస్తూ, తుపాను తర్వాత కలిగే ఇన్ఫెక్షన్‌లు, నీటి కాలుష్యం వంటి సమస్యలు ఎదురుకాలేకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Google News in Telugu montha cyclone Rains

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.