బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం, ఈ వాయుగుండం శ్రీలంకకు Sri Lanka ఈశాన్యంగా ఉన్న ముల్లయిట్టివు సమీపంలో నిన్న సాయంత్రం తీరం దాటింది. ప్రస్తుతం ఇది పశ్చిమ దిశగా కదులుతూ, ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
Read also: Weather: తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
Rains expected today in South Coastal Andhra Pradesh and Rayalaseema
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
ఈ వాయుగుండం ముల్లయిట్టివుకు సుమారు 30 కిలోమీటర్లు, జాఫ్నాకు 70 కిలోమీటర్లు, మన్నార్‌కు 90 కిలోమీటర్లు, కరైకల్‌కు 190 కిలోమీటర్లు, చెన్నైకు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. కదలికలో భాగంగా వాయుగుండం తీవ్రత క్రమంగా తగ్గుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
వాయుగుండం ప్రభావంతో తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా జిల్లాలు మరియు రాయలసీమ ప్రాంతాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ సూచనలను గమనిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: