📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Rain Alert: తిరుమలను ముంచెత్తిన వాన

Author Icon By Rajitha
Updated: October 23, 2025 • 11:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rain Alert: 7 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు – జలాశయాల్లోకి మోస్తరుగా చేరిన వరద నీరు తిరుమల : వరుసగా నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల (Tirumala) కొండ జలమయంగా మారింది. మంగళ, బుధవారాల్లో రెండురోజులు సుమారు ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రధాన తాగునీటి జలాశయాలు గోగర్బమ్, పాపవినాశనం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార తీర్థాల డ్యామ్లకు మోస్తరుగా వరద నీరు చేరింది. ప్రస్తుతం ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలతో 2026 మార్చి నెలాఖరు వరకు తాగునీటి సమస్య తీరిందని టిటిడి వర్గాలు తెలిపాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో గత నాలుగు రోజులుగా విడవకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోగర్భమ్ డ్యామ్, ఆకాశగంగ జలాశయాలకు వరదనీరు చేరడంతో నిల్వలు పెరిగాయి. తిరుమలలో తాగునీటి జలాశయమైన గోగర్భండ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 2,894 అడుగులు కాగా 80శాతం నీటిమట్టం చేరింది. పాపవినాశనం 697.14 అడుగులు కాగా 63శాతం నీరుచేరింది.

Read also: Tuni: బాలిక పై అత్యాచార కేసులో నిందితుడు ఆత్మహత్య

Rain Alert: తిరుమలను ముంచెత్తిన వాన

ఆకాశగంగ జలాశయం 685 లక్షల గ్యాలన్లు నీటి సామర్థ్యం ఉండగా వరదనీటితో 60శాతం మట్టం చేరింది. ఇక తిరుమలలో రెండు ప్రధాన పెద్ద జలాశయాలు కుమారధార, పసుపుధార తీర్థాలు. యాల్లో పసుపుధార 2,833 లక్షల గ్యాలన్లనీటి సామర్థ్యం, కుమారధారతీర్థం 4,258 లక్షల గ్యాలన్లు నీటి సామర్థ్యం కాగా 50శాతం మాత్రమే నీరు చేరింది. ఇదివరకు అడపాదడపా వర్షాలు వచ్చినా జలాశయాలకు పెద్దగా నీరు చేరలేదు. గత రెండు రోజులుగా తుఫాన్తో కురిసిన వర్షాలకు వరదనీరు చేరడంతో తాగునీటి సమస్యకు ఇబ్బందులు తొలగినట్లేనని టిటిడి నీటివిభాగం తెలిపింది. ఈ వరదనీరు కొండల్లోంచి తిరుపతి మాల్వాడిగుండం, కపిలతీర్థం జలాశయాల్లోకి ప్రవహిస్తోంది. తిరుమలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజూ లక్షమంది వరకు భక్తులు వస్తున్నారు. నీటి వినియోగంకూడా పెరిగింది. ప్రతిరోజూ కొండపై 43 లక్షల గ్యాలన్ల నీరు వినియోగిస్తున్నారు. ఇందులో 18 లక్షల గ్యాలన్ల నీరు తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు

వరదనీటిలో తిరుమల ఆలయం పరిసరాలు

గోగర్భమ్, ఆకాశగంగ, పాపవినాశనమ్, కుమారధార, పసుపుధార తీర్థాల డ్యామ్ల నుండి వాడుకుంటున్నారు. ఇప్పుడు తాజా పరిస్థితులతో జలాశయాల్లో నీరు 180 రోజులు వరకు అవసరాలకు సరిపోతుందనే అంచనా. బంగాళాఖాతంలో అల్పపీడనంతో తిరుమలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం వరకు విడవకుండా కురిసిన జోరువానలకు జలమయంగా మారింది. ఆలయం ముందుభాగం, పరిసరాలు, మాఢవీధుల్లో వరదనీరు ప్రవహించింది. వర్షాలతో వాతావరణం పూర్తిగా మారడంతో విపరీతమైన చలిగాలులు వీస్తున్నాయి.

తిరుమలలో ఎన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి?
తిరుమలలో వరుసగా నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఈ వర్షాలతో తిరుమలలో ఎంత వర్షపాతం నమోదైంది?
సుమారు 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Floods Heavy Rainfall latest news Telugu News tirumala tirupati Water Reservoirs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.