విజయవాడ VIjayavada :బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ అల్పపీడనం కొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. అది శనివారం ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశముందని అంచనా వేశారు. దీని ప్రభావంతో 5 రోజులపాటు మోస్తరు వర్షాల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం, తుపాను హెచ్చరికల కేంద్రాలు తెలిపాయి. Rain Alert ఇక వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా తీరంలో అల్పపీడనం కొనసాగుతుండగా, మరోవైపు తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ, నేడు వాయుగుండంగా బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
Godavari:మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, అధికార యంత్రాంగం అప్రమత్తం
Rain Alert
సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అల్లూరి, కాకినాడ, ప.గో., కోనసీమ, కర్నూలు ఎల్లో అలెర్ట్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇవాళ నంద్యాల, అనంతపురం, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురస్తాయని తెలిపింది. కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. Rain Alert కృష్ణపట్నం మినహా మిగతా ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎవ్వరి మొబైల్ లోనైనా దామిని యాప్ ఉంటే పిడుగుల సమాచారాన్ని వారే తెలుసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటిలోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. మనకు దగ్గరలో 20 నుంచి 20 కిలోమీటర్లు పరిధిలో పిడుగులు పడే అవకాశాలు ఉంటే గనక ఈ యాప్ మనల్ని ముందుగానే అప్రమత్తం చేస్తుంది. అలాగే కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్లు ఈ యాప్లో నమోదు చేయవచ్చు. దాంతో వారిని అప్రమత్తం చేసే వీలుంటుంది.
బంగాళాఖాతంలో ఏ వాతావరణ పరిస్థితి ఏర్పడింది?
తీవ్ర అల్పపీడనం బలపడుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
వాయుగుండం ఎప్పుడు, ఎక్కడ తీరం దాటే అవకాశం ఉంది?
శనివారం ఉదయానికి దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: