Rain Alert: దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది కాబట్టి, మత్స్యకారులు వచ్చే శనివారం వరకు వేటకు వెళ్లవద్దు అని అధికారులు హెచ్చరించారు. ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రజలు సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించవచ్చు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఎపిలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, ప్రకాశం, బాపట్ల తదితర జిల్లాలో భారీ వర్షాలు (Heavy rain) కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం తీవ్ర ఇబ్బంది పడుతున్నది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనవి. కౌండిన్య నదిలో జల ప్రవాహం ఎక్కువగా ఉన్నది కావున ప్రజలు నీటి ప్రవాహం వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎడతెరపి లేని వర్షాల వలన మనుషులే కాక జంతువులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. బుధవారం ఉదయం పలమనేరు మున్సిపల్ కమిషనర్ లోతట్టు ప్రాంతాలైన పలమనేరు పెద్ద చెరువు ఎద్దుల చెరువు ముంపు ప్రాంతాలను పరిశీలించి ఆయా ఏరియా వార్డు సెక్రటేరియలకు సహాయక చర్యల నిమిత్తం ఆదేశాలు జారీ చేశారు.
Read also: Rain Alert: భారీ వర్షాలతో అతలాకుతలం అయినా తమిళనాడు
Rain Alert: AP లో భారీ వర్షాలతో అధికారుల అలర్ట్
ఏపిలోని పలు జిల్లాలో భారీ వర్షాలు (Rain Alert) కురుస్తున్నాయి. చిత్తూరు, ప్రకాశం, బాపట్ల తదితర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం తీవ్ర ఇబ్బంది పడుతున్నది. రాష్ట్రానికి వాయుగుండం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులను రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అప్రమత్తం చేశారు. దక్షిణకోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు సంసిద్ధంగా ఉండాలన్నారు. అవసర మైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మత్స్యకారులు ఎవ్వరూ చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. భారీ వర్షాల కారణంగా ఎక్కడెక్కడ వాగులు పొంగుతాయో అక్కడి ప్రజలను హెచ్చరించాలని ఆదేశాలు జారీ చేశారు. చెట్లు విరిగిపడే చోట ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా అధికారులంతా సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న వర్షాలు, పిడుగుపాటు ఇద్దరు మహిళలు మృతి
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం తమిళనాడు (Tamil nadu) తీరం నుంచి వాయవ్య దిశగా కదిలి అదే ప్రాంతంలో కొనసాగుతోంది. వాయువ్య దిశగా రాబోయే 12 గంటల్లో నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. తదుపరి 12 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్ర కోస్తా తీరాల మీదుగా కదిలే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో రాయలసీమ లోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు కోస్తాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు ఫ్లాష్ ప్లడ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని చెప్పారు. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఏపీ తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది?
దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి, సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది.
మత్స్యకారులకు అధికారులు ఏ సూచనలు చేశారు?
వచ్చే శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: