📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Rain Alert: మళ్లీ వానలు..బాంబు పేల్చిన వాతావరణ శాఖ

Author Icon By Saritha
Updated: October 31, 2025 • 4:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏకాలంలో..ఏ సీజన్ లో జీవిస్తున్నామో మనకు తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ సంవత్సరం ఏప్రిల్, మే నెలలో ఉండాల్సిన ఎండలకు బదులు వర్షాలు(Rain Alert) కురిశాయి. జూన్, జులై మాసంలో కురవాల్సిన వర్షాలు ఆలస్యంగా ఆగస్టు, సెప్టెంబరులో విపరీతంగా కురిశాయి. ఇక అక్టోబరు అదీ చివరి రోజులో ఉన్న మనం చలికాలంలోకి ప్రవేశించాం. కానీ ఈవారంలో ఆంధ్రా, తెలంగాణలో మొంథా తుపాన్ తో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. తీరప్రాంత జిల్లాల్లోని పలు గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. చేతికందిన పంట కాస్త వరదపాలైపోయింది.

Read also: మొంథా తుఫాన్‌ బీభత్సం..వరదల్లో ఏడుగురు మృతి

Rain Alert: మళ్లీ వానలు..బాంబు పేల్చిన వాతావరణ శాఖ

పొంచివున్న మరో తుపాను, తప్పని వర్షాలు

హైదరాబాద్ వాతావరణశాఖ(Meteorological Department) తెలంగాణకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడురోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు విదర్భ దాని సమీపంలోని దక్షిణ ఛత్తీఘడ్ ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం గడిచిన ఆరుగంటల్లో ఉత్తర, వాయువ్య దిశలో కదిలి శుక్రవారం ఉదయం వాయువ్య ఝార్ఖండ్ దాని సమీపంలో కొనసాగుతోంది.

మరోమూడురోజుల పాటు వర్షాలు

ఈ తీవ్ర అల్పపీడనం(Rain Alert) రానున్న 12గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో కదులుతూ బీహార్ మీదుగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ సహా పలు తీరప్రాంత జిల్లాల్లో రానున్న మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గురువారం నుంచి తెలంగాణలో కాస్త వాతావరణం కుదుటపడడంతో రైతులు తేరుకుంటున్నారు. కానీ మరో రెండురోజుల పాటు వర్షాలు అనడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికే చేతికి అందిన పంట వరదపాలైపోవడంతో తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోకపోతే బతకలేమని చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Rain AP Floods Cyclone Warning Heavy Rainfall IMD alert montha cyclone Telangana Rains Telangana Weather

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.