📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

News Telugu: Rain Alert: మరో 3 రోజులు భారీ వర్షాలు: హోంమంత్రి అనిత

Author Icon By Rajitha
Updated: October 23, 2025 • 10:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rain Alert: విపత్తు నివారణ సంస్థ అధికారులతో సమీక్షించిన హోంమంత్రి అనిత (Anitha) వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి విజయవాడ : బంగాళా ఖాతంలోని తీవ్ర అల్పపీడనం రాబోయే 12 గంటల్లోపు వాయుగుండంగా బలపడనున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతూ ఆ తదుపరి 12 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణసంస్థ అధికారులతో హోంమంత్రి అనిత బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదని సూచించారు. సహయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలిస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు.

Read also: Rain Alert: APలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక

Rain Alert: మరో 3 రోజులు భారీ వర్షాలు

జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ 24/7 అలెర్ట్ ఉండాలని ఆదేశాలు జారీచేశారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని.. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక మెస్సేజులు పంపాలని అధికారులకు తెలియజేశారు. సహయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలన్నారు. ప్రజలు సురక్షితమైన భవనాల్లో ఉండాలని హోంమంత్రి అనిత వినతి చేశారు,ఇక శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, (Nellore) తిరుపతి, వైఎస్సార్ కడప, అన్న మయ్య, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరేంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీనుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం,శ్రీసత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేసింది. గురువారం (ఈ నెల23వ తేదినుంచి) నుంచి ఆదివారం వరకు రాష్ట్రంలోని అక్కడక్కడ భారీ వర్షాలు (Rain Alert) కొనసాగే అవకాశం ఉంది.

రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుంది?
రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

హోంమంత్రి అనిత ఎవరితో సమీక్ష నిర్వహించారు?
విపత్తు నివారణ సంస్థ అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Bay Of Bengal cyclone Heavy Rain latest news Telugu News Weather Alert

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.