ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) లో వాతావరణం మరోసారి మార్పులకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతం–శ్రీలంక తీర పరిసరాల్లో ఏర్పడిన కొత్త అల్పపీడనం ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడనం దిశ మార్చుకున్న కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమవుతాయని తెలిపింది. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో అక్కడి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కూడా గణనీయమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హెచ్చరిక జారీ చేశారు.
.Read also: Weather: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి

Rain Alert
ప్రజలు మరింత అప్రమత్తంగా
తీరం వెంట గాలి వేగం పెరిగే అవకాశం ఉండటంతో గంటకు 55 కి.మీ వరకు ఈదురు గాలులు వీయవచ్చని, మత్స్యకారులు ఈ రెండు రోజులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు సలహా ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే వాతావరణం అసాధారణ మార్పులు చూపిస్తోంది. కొన్నిచోట్ల రాత్రి పూట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల వరకు పడిపోతుండగా, మరికొన్ని జిల్లాల్లో పగటి వేళల్లో 35 డిగ్రీలపైగా నమోదవుతున్నాయి. ఈ విభిన్న పరిస్థితుల మధ్య కొత్త వర్ష సూచన రావడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: