తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు కురిసిన కుండపోత వానలతో నానా బీభత్సం సృష్టించిన వరుణుడు, మరోసారి విరుచుకుపడేందుకు సిద్ధమయ్యాడు. రేపు (అక్టోబర్ 11) బంగాళాఖాతంలో అల్పపీడనం(low pressure) ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో వచ్చేవారం అంతా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ ఒడిశా నుండి కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది.
Read also :IPPB 2025: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు లో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్లు…
తెలంగాణలో నేడు, రేపటి వర్ష సూచన
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా కొనసాగుతున్న ద్రోణికి ఉపరితల ఆవర్తనం తోడైంది. దీని ప్రభావంతో నేడు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు కూడా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
భారీ వర్షపాతం నమోదు
గడచిన 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో అత్యధికంగా 9.15 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
- ఆ తర్వాత మల్కలపల్లిలో 7.55 సెం.మీ., నల్లగొండ జిల్లా తిప్పర్తిలో 6.78 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
- కట్టంగూరులో 5.07 సెం.మీ., నార్కెట్‌పల్లిలో 4.76 సెం.మీ. మేర వర్షాలు కురిశాయి.
- మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేటలో 4.71 సెం.మీ., భూత్పూర్లో 4.59 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
వచ్చేవారం కుండపోత వానలు
తెలంగాణ, ఏపీ మీదుగా కొనసాగుతున్న ద్రోణికి ఉపరితల ఆవర్తనం తోడైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం మరింత బలపడి రేపటికి (అక్టోబర్ 11) అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావంతో వచ్చే వారం తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఎప్పుడు ఏర్పడే అవకాశం ఉంది?
రేపు (అక్టోబర్ 11) బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
నేడు తెలంగాణలో ఏ జిల్లాలకు వర్ష సూచన ఉంది?
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :