📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Telugu News: Raghuramakrishna Raju-జగన్ కు శాసనసభా చట్టాలు తెలియవా?

Author Icon By Pooja
Updated: September 22, 2025 • 12:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శాసనసభా చట్టాలు తెలియకపోవడం ఆశ్చర్యకరమని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్రంగా విమర్శించారు. గతంలో జగన్ ఎంపీగా, ఐదేళ్లు ప్రతిపక్షనాయకుడిగా, ముఖ్యమంత్రిగా పనిచేశారని, అయినప్పటికీ ఆయనకు అసెంబ్లీ రూల్స్(Assembly Rules) తెలియకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదని ప్రశ్నించారు.

రఘురామకృష్ణరాజు ప్రకారం, భారత రాజ్యాంగంలోని 190(4) ప్రకారం ఎవరైనా సభ్యులు లీవ్ ఆఫ్ యాక్షన్స్ అడగకుండా వరుసగా 60 రోజులు సమావేశాలకు హాజరుకాకపోతే శాసనసభ లేదా పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హులు అవుతారని స్పష్టంగా ఉంది. ఇది జగన్కు తెలియదా అని ఆయన నిలదీశారు.

అసెంబ్లీ రూల్స్ నెట్‌లో అందుబాటులో ఉంటాయని, జగన్ వాటిని పరిశీలించాలని రఘురామకృష్ణరాజు సూచించారు. వైసీపీ అధ్యక్షులు, సలహాదారులు, ఎమ్మెల్యేలు ఈ రూల్స్‌ని చూసుకుంటే ఎవరూ ఎవరిని తప్పుదారి పట్టిస్తున్నారనేది స్పష్టమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రతిపక్షానికి(opposition) అసెంబ్లీలో సమయం కేటాయించడం ఆయా పార్టీల బలం ఆధారంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతిరోజూ క్వశ్చన్ అవర్‌లో వైసీపీ సభ్యులకు రెండు ప్రశ్నలు కేటాయించబడుతున్నాయని తెలిపారు. అయితే, వైసీపీ సభ్యులు సభలో ఎందుకు ఉండడం లేదని ప్రశ్నించారు. గత ఐదు సంవత్సరాల జగన్ ప్రభుత్వ కాలంలో ఏపీ అసెంబ్లీ 68-69 రోజులు మించి ఎందుకు జరగలేదని రఘురామకృష్ణరాజు నిలదీశారు.

రఘురామకృష్ణరాజు జగన్ పై ఎందుకు విమర్శలు చేశారు?
జగన్ శాసనసభా చట్టాలు, రూల్స్ తెలియనట్లు వ్యాఖ్యలు చేయడం పట్ల ఆయన విమర్శలు గుప్పించారు.

రాజ్యాంగంలోని 190(4) ప్రకారం ఏముంది?
ఎవరైనా లీవ్ ఆఫ్ యాక్షన్స్ అడగకుండా వరుసగా 60 రోజులు సమావేశాలకు హాజరుకాకపోతే శాసనసభ లేదా పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హులు అవుతారని చెబుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/news-telugu-nara-lokesh-%e0%b0%9c%e0%b1%80%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%80-2-0%e0%b0%aa%e0%b1%88-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b2%e0%b1%8b%e0%b0%95/andhra-pradesh/551637/

Andhra Pradesh Assembly Latest News in Telugu Raghurama Krishnam Raju Telugu News Telugu News Today YS Jagan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.