రుషికొండ (Rushikonda) పై నిర్మించిన విలాసవంతమైన భవనంపై రాష్ట్ర అసెంబ్లీలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు (Raghurama Krishnam Raju) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రజాధనంతో ఏర్పాటైన ఈ నిర్మాణం ఒక పేదవాడు తనకోసం కట్టుకున్న చిన్న గూడు లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. “ఇంతటి భవనాన్ని కూల్చివేయకుండా, ప్రజలు చూసేందుకు వీలుగా టికెట్ వేసి ఆదాయం తెచ్చుకోవాలి” అని ప్రభుత్వానికి సూచించారు.
అంటే ఈ భవనాన్ని రాష్ట్ర ఆస్తిగా పరిగణించి పర్యాటక ఆకర్షణగా మలిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం.గత ప్రభుత్వ హయాంలో ఈ భవన నిర్మాణంపై తాను చేసిన న్యాయపోరాటాన్ని రఘురామకృష్ణంరాజు గుర్తు చేసుకున్నారు. కేవలం 22,000 చదరపు అడుగులకు మించి నిర్మాణం చేపట్టరాదని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, వాటిని ఉల్లంఘించి లక్ష చదరపు అడుగులకు పైగా నిర్మించారని ఆరోపించారు. పర్యాటక అభివృద్ధి పేరుతో కోర్టులకు తప్పుడు అఫిడవిట్లు సమర్పించి, ప్రజలను, న్యాయవ్యవస్థను మోసం చేశారని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావడానికి
ఈ భవనంపై రూ.500 కోట్లు ఖర్చు చేయడం ద్వారా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ సమాధిని తానే కట్టుకున్నారని రఘురామ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “ఆ రూ.500 కోట్ల దుర్వినియోగం వల్లే ఆయనపై వ్యతిరేకత పెరిగి, రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావడానికి దోహదపడింది. కాబట్టి ఆ తప్పును మనం క్షమించేయొచ్చు” అని ఆయన చమత్కరించారు. ముంతాజ్ కోసం షాజహాన్ కట్టిన తాజ్‌మహల్‌లాగే, ఒక నియంత కట్టుకున్న భవనంగా దీనికి గుర్తింపు తెచ్చి, మాన్యుమెంట్‌గా మార్చాలని ఆయన కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: