📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Raghurama Krishna Raju: సైబర్ క్రైమ్స్ పై మరింత కఠిన చట్టాలు

Author Icon By Anusha
Updated: July 19, 2025 • 3:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శాసనసభ పిటిషన్ల కమిటీ చైర్మన్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె. రఘురామ కృష్ణ రాజు

విజయవాడ : సైబర్ క్రైమ్స్ పై ఉక్కుపాదం మోపే విధంగా ప్రస్తుతం ఉన్న చట్టానికి మరింత పదును పెట్టే విధంగా వచ్చే శాసన సభా సమావేశాల్లో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ అభిప్రాయపడుతున్నట్లు ఆ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె. రఘు రామకృష్ణ రాజు (K. Raghurama Krishna Raju) తెలిపారు. పటిష్టమైన చట్ట రూపకల్పనకు హోం, ఐటి శాఖ కార్యదర్శలతో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ సమావేశంలో సమగ్రంగా చర్చించడం జరిగిదని ఆయన తెలిపారు. శుక్రవారం రాష్ట్ర శాసన సభ భవనంలోని తమ ఛాంబరులో కమిటీ సభ్యులు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే పి విష్ణు కుమార్ రాజు, చిత్తూరు శాసన సభ్యులు గురజాల జగన్మోహన్ తో కలసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ విషయాన్నివెల్లడించారు.

Raghurama Krishna Raju: సైబర్ క్రైమ్స్ పై మరింత కఠిన చట్టాలు

ఆదేశాల మేరకు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుచున్న సైబర్ క్రైమ్స్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, వారి ఆదేశాల మేరకు ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ వల్ల రాష్ట్రంలోని ఎంతో మంది అమాయకులు మోసపోతున్నారని, వీటికి సంబందించి కేవలం 4 శాతం కేసులు మాత్రమే రిజిస్టరు అయ్యాయని, మొత్తం రూ.960 కోట్లు మేర మోసం జరిగిందని, ఇందులో రూ.300 కోట్ల వరకూ రికవరీ చేయడం జరిగిందని గత ఏడాది నివేదికలు వెల్లడిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ లెక్కన ఏడాది దాదాపు రూ.30 వేల కోట్ల వరకూ సైబర్ క్రైమ్ (Cybercrime) మోసాలు జరుగుచున్నట్లు ఆయన తెలిపారు.

కే. రఘురామకృష్ణ రాజు ఎవరు?

కే. రఘురామకృష్ణ రాజు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆయన నర్సాపురం (పశ్చిమ గోదావరి) లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్, పిటిషన్ల కమిటీ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఆయన ఏ రాజకీయ పార్టీకి చెందినవారు?

ఆయన తొలుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. అయితే, తరువాత వైసీపీలో ఉండి, పార్టీపై విమర్శలు చేసిన కారణంగా ఆయనపై అనేక వివాదాలు వచ్చాయి. ఆయన తిరుగుబాటు స్వభావం కారణంగా తెలుగుదేశం పార్టీతో దగ్గరగా ఉన్నారని అంటారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Durgamma Saare: భాగ్యనగర్ అమ్మవార్లకు దుర్గమ్మ ఆషాఢం సారె

Andhra Pradesh AP Assembly AP Deputy Speaker AP IT Department Breaking News Cyber Crime Law Cyber Law Amendment Cybercrime Bill K Raghurama Krishna Raju latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.