హైదరాబాద్ (ముషీరాబాద్) : జనవరి 8న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబోయే బీసీ ఉద్యోగు మహాసభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య(R. Krishnaiah) పిలుపు నిచ్చారు. హైదరాబాద్ లోని బీసీ భవన్లో మహాసభకు సంబంధించిన గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు.
Read Also: TG Politics: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCR, హరీశ్‌కు నోటీసులు ఇవ్వనున్న సిట్?
ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య(R. Krishnaiah) మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు(Reservations) కల్పించాలని, రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ నిబంధనను ఎత్తివేయాలని, పోస్టింగ్స్, బదిలీలలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ ఉద్యోగుల మహాసభ జరుపుతున్నామని తెలిపారు.
బీసీ ఉద్యోగుల పట్ల మేనేజ్మంట్ నిర్లక్ష్యం వీడాలని, బీసీ ఉద్యోగుల(BC employees)కు రావల్సిన అన్ని ప్రొవిజన్స్ తక్షణమే ఇవ్వాలని, అన్ని విద్యుత్ కంపెనీలలో డైరెక్టర్ 50శాతం పోస్టులు, ఛైర్మన్ పోస్టు లు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులు ప్రమోషన్లలో రిజర్వేషన్లకై విద్యుత్ బీసీ ఉద్యోగులంతా పోరాడాలని సూచించారు. బీసీ ఉద్యోగులందరూ ఏకమై, రాజ్యాధికారం దిశగా పునాదులు వేయాలని, మేధావులు ముందుకు వచ్చి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టవలసిన బాధ్యత తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.కే.వీర భద్రయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, విటిపి ఎస్ సీలనకరీ శ్రీ మారి అన్ని కంపెనీల ప్రతినిధులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు నీల వెంకటేష్, రాజేందర్, రాందేవ్ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: