10 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా, అన్ని మోలిక సదుపాయాలు కల్పించాలి: మంత్రి అనగాని శ్రీసత్యసాయి జిల్లా : భగవాన్ సత్యసాయి బాబా (sathya sai baba) శతజయంతి ఉత్సవాలను గ్రాండ్ సక్సెస్ చేసే విధంగా అధికారులందరు సమన్వయంతో కృషి చేయాలని మంత్రుల కమిటీ చైర్మన్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం మంత్రుల కమిటీ చైర్మన్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తో పాటు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలు గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి శ్రీసత్యసాయి విమానాశ్రయం చేరుకుని అక్కడ నుండి ప్రత్యేక వాహన శ్రేణిలో శాంతిభవన్ చేరుకున్నారు.
Read also: TTD: ‘సిట్’ముందుకు కల్తీనెయ్యి సూత్రధారులు
Puttaparthi: సత్యసాయి శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలి
శాంతి భవన్లో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ తో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి, స్థానిక శాసన సభ్యురాలు పల్లెసింధూరరెడ్డి, మడకశిర శాసనసభ్యులు ఎమ్మెస్ రాజు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి సంపత్, ప్రత్యేక ప్రధానకార్యదర్శిలు కృష్ణ బాబు, అజయ్ జైన్ కలెక్టర్ శ్యాంప్రసాద్ ఎస్పి సతీష్ కుమార్, డిఐజి షిమోషి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ లతో శాంతిభవన్లో శత జయంతి ఉత్సవాలపై సమీక్షించారు.
ప్రధాని నరేంద్ర మోడీ రానున్న
భారత ప్రధాని నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లతో పాటు పట్టణంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్న పనులపై ట్రస్టు ప్రతినిధులతో దాదాపు గంట సేపు చర్చించారు. అనంతరం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను పుట్టపర్తి మున్సి పాలిటీ పరిధిలో అంత 387 పరిశీలించారు. అనంతరం సాయి ఆరామంలో విలేకరులతో మాట్లాడుతూ, భగవాన్ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు జరుపుకోవడం మన అదృష్టంగా భావించాలని కార్యక్రమాలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, లతోపాటు ముఖ్యమంత్రులు రాష్ట్ర గవర్నర్లు, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులు శతజయంతి ఉత్సవాలలో పాల్గొంటారు
10 లక్షల మంది భక్తులు హాజరవుతారని
వారికి వసతి ఏర్పాట్లతో పాటు భద్రతను కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఉత్సవాలకు దేశ విదేశాల నుండి దాదాపుగా 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేయడం జరిగిందన్నారు. అందుకు తగ్గట్టుగా అన్ని మోలిక సదుపాయాలు కల్పించే విధంగా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నవంబర్ 13 నుండి 17 వ తేదీ వరకు ప్రతిరోజు 40 వేల మంది భక్తులు పుట్టపర్తికి రానున్నట్లు ఆయన తెలిపారు. నవంబర్ 17 నుండి 23 వరకు రోజుకు లక్షల మంది భగవాన్ బాబా వారి శతజయంతి ఉత్సవాలలో పాల్గొననున్నట్లు అంచనా కలదన్నారు. 19వ తేదీ హిల్ వ్యూ స్టేడియంలో జరిగే ప్రధాని మోడీ సభలో దాదాపు రెండున్నర గంటలపాటు గడపనున్నారన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: