📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Puttaparthi: శ్రీ సత్యసాయిబాబా వేడుకల్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి

Author Icon By Anusha
Updated: November 23, 2025 • 12:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పుట్టపర్తి (Puttaparthi) లో జరుగుతున్న శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సహా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

Read Also: TG Weather: రానున్న రెండు రోజులు వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు జారీ

వారితోపాటు.. పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హిల్ వ్యూ స్టేడియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హిల్‌వ్యూ స్టేడియంలో జరిగిన కార్యక్రమాల్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని కళ్లకుకట్టేలా కళారూపాలను ప్రదర్శించారు.

Puttaparthi: Chandrababu, Revanth Reddy at Sri Sathya Sai Baba celebrations

ఏపీ, తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఆయా ప్రాంతాల్లోని క్షేత్రాల ప్రాధాన్యతను తెలిపే ఆకృతులతో ర్యాలీ చేశారు. అటు.. పుట్టపర్తి సత్య సాయిబాబా శత జయంతి వేడుకలకు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు, గవర్నర్లు కూడా హాజరయ్యారు. సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ సేవాకార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈరోజే లాస్ట్

సత్యసాయి శతజయంతి వేడుకల్లో భాగంగా ఇవాళ ప్రశాంతి నిలయంలో మందిరం నుంచి స్వర్ణరథంపై సాయి ప్రతిమను ఊరేగిస్తారు. అక్కడి నుంచి హిల్‌వ్యూ స్టేడియం వరకూ ర్యాలీ ఉంటుంది. ఈ శతజయంతి ఉత్సవాలు ఇవాళ్టితో ముగుస్తున్నాయి.

సేవా మార్గాన్ని ఆచరించి.. బోధించి.. కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసిన సత్యసాయి శతజయంతి వేడుకలు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పుట్టపర్తి (Puttaparthi) కి తరలివచ్చారు. దాదాపు 100 దేశాల నుంచి భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అంతా సేవా కార్యక్రమాల్లో స్వచ్చందంగా పాల్గొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AP CM Chandrababu Naidu latest news Puttaparthi celebrations Sri Sathya Sai Centenary Telangana CM Revanth Reddy Telugu News Vice President Radhakrishnan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.