Punarvika: పునర్విక జన్యు వ్యాధి గతంలో ఇతరులకొచ్చిందా?

Read Time:  1 min
Punarvika: పునర్విక జన్యు వ్యాధి గతంలో ఇతరులకొచ్చిందా?
FONT SIZE
GET APP

Punarvika: స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) ఇది కేవలం ఒక వ్యాధి పేరు మాత్రమే కాదు, ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్న ఒక అరుదైన జన్యుపరమైన రుగ్మత. కోట్లాది రూపాయల ఖరీదైన ఇంజెక్షన్ ఉంటేనే ప్రాణాలు నిలిచే ఈ మహమ్మారి, తాజాగా ఏపీకి చెందిన 11 నెలల పాప పునర్వికను వేధిస్తోంది. ఈ పాప ప్రాణాలను నిలబెట్టేందుకు నెటిజన్లు, సెలబ్రిటీలు అందరూ కలిసి #SavePunarvika అనే హ్యాష్‌ట్యాగ్‌తో విరాళాల వేట మొదలుపెట్టారు.

Read also: Adulterated milk : కాటేస్తున్న కల్తీపాలు

Punarvika: పునర్విక జన్యు వ్యాధి గతంలో ఇతరులకొచ్చిందా?
Punarvika: Has the Punarvika genetic disease been transmitted to others in the past?

గతంలో వ్యాధి బారిన పడిన చిన్నారులు

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలువురు చిన్నారులు ఈ వ్యాధితో పోరాడుతున్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో అయాన్ష్ అనే చిన్నారికి వచ్చింది. అలాగే, రాజస్థాన్‌కు చెందిన నూర్ ఫాతిమా (7 నెలలు) ఇంజెక్షన్ అందకముందే మృతి చెందింది. అదేవిధంగా హైదరాబాద్‌లోని కాచిగూడకు చెందిన నాలుగున్నరేళ్ల శాన్వికి కూడా సేమ్ ఇష్యూ ఉంది. కోయంబత్తూరుకు చెందిన జుహా జైనాబ్‌ కూడా ఈ వ్యాధి రాగా అమెరికా సంస్థ (Turbine Drug Company) లక్కీ డ్రా ద్వారా జోల్‌జీన్‌స్మా ఇంజెక్షన్‌ను ఉచితంగా అందించింది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 నెలల పాప పునర్విక ఈ వ్యాధి బారిన పడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమె ప్రాణాలు దక్కాలంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ అవసరం. మధ్యతరగతి కుటుంబం కావడంతో అంత పెద్ద మొత్తాన్ని సేకరించడం వారికి భారంగా మారింది. చికిత్సకు వాడే జోల్‌జీన్‌స్మా ఇంజెక్షన్ ధర సుమారు రూ. 16 కోట్ల పైమాటే. ఇంత ఖరీదైన మందులను కొనడం అసాధ్యం. ఇలాంటి అరుదైన వ్యాధుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి, మందులపై దిగుమతి సుంకాలు తగ్గించడంతో పాటు ఆర్థిక సాయం అందించాలని బాధితుల కుటుంబాలు వేడుకుంటున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.