📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

News Telugu: Provident Fund- కార్మికులందరికి ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం ఉండాలి- వీరభద్రస్వామి

Author Icon By Sharanya
Updated: August 22, 2025 • 1:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బల్లికురవ (ప్రకాశం): గ్రానైట్ గనులలో పని చేసే ఉద్యోగులు, యజమానుల ప్రయోజనాల కోసం ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నూతనంగా ప్రారంభించిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గర్ యోజన (Vikasit Bharat Rozgar Yojana) కార్యక్రమం స్థానిక వీటీసీ భవనంలో జరిగింది. గ్రానైట్ గనుల యాజమాన్య ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్రానైట్ గనుల్లో పని చేసే కార్మికులందరికి ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం ఉండాలని, రాష్ట్ర పీఎఫ్ కమీషనర్ వీరభద్ర స్వామి అన్నారు.

కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పించాలి

ఇటీవల సత్య కృష్ణ గ్రానైట్ గని (Granite mine) లో పరాయి రాష్ట్రం కార్మికులు మృత్యువాత పడిన నేపథ్యంలో సంబంధిత అధికార యంత్రాంగంలో కదలిక ఆరంభమైంది. గ్రానైట్ గని నిర్వహించే సమయంలో కార్మికులు ఎంత మంది ఉంటే ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పించాలి, అందువల్ల యాజమాన్యాలకు, కార్మిక కుటుంబాలకు వనగూరే అదనపు ప్రయోజనాలను వివరిస్తూ ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ పథకం కింద భారత ప్రభుత్వం ఉద్యోగులకు, యాజమానులకు ప్రయోజనాలను నిర్ధిష్ట కాలానికి చెల్లిస్తుందని తద్వారా యజమానులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందన్నారు. ఈ పథకం ఈ ఏడాది ఆగష్టు ఒకటి నుండి 2029 జులై 31 వరకు వర్తిస్తుందన్నారు. యాజమాన్యాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్ తానయ్య సెల్వాక్త, ఒంగోలు అసిస్టెంట్ ప్రావిడెంట్ కమీషనర్ పి. గోపాల్ సింగ్, గ్రానైట్ గనుల యాజమాన్య ప్రతినిధి పత్తిపాటి సురేష్, వివరాలను వెల్లడించగా ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్స్పెక్టర్ పఠాన్, వెంకన్నబాబు, యజమానులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ap-politics-leadership-should-be-vigilant-on-special/andhra-pradesh/534303/

Breaking News latest news PF for Workers Provident Fund Telugu News Veerabhadraswamy Workers Welfare

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.