Anantapur RTC News: ఆర్టీసి ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి: సిపిఐ ధర్నా

Follow Us: Google News Daily Hunt
RTC Privatization protest Anantapur
RTC Privatization protest Anantapur
FONT SIZE
GET APP

Anantapur RTC News: విద్యుత్ బస్సుల నిర్వహణ ఆర్టీసినే చూడాలి. అర్టీసి ఆస్తులను కాపాడాలి. అనంతపురము ఆర్టీసి డిపో ముందు ధర్నా ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వారికి దారాదత్తం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, విద్యుత్ బస్సుల నిర్వహణ ఆర్టీసీ నే చూడాలని ఈ రోజు సిపిఐ, ఏఐటీయూసీ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, మహిళా సమాఖ్య, చేతివృత్తి దారుల సమాఖ్య ఆధ్వర్యంలో అనంతపురం ఆర్టీసీ డిపో ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి మాట్లాడుతూ.. విద్యుత్ బస్సుల వినియోగాన్ని స్వాగతిస్తున్నామని కానీ బస్సుల నిర్వహణ పూర్తిగా ఆర్టీసీ నే చూడాలన్నారు.

Read also: Parvathipuram Manyam: గిరిజనుల ప్రాణాలకు రక్షణ లేదా?

RTC Privatization protest Anantapur
RTC Privatization protest Anantapur

Anantapur RTC News: ఆర్టిసి ప్రైవేటీకరణ చేయొద్దు

నెల్లూరు 2 డిపోలను పూర్తిగా ఖాళీ చేయించి ప్రైవేట్ కంపెనీల వారికి అప్పజెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆర్టీసీలో ఉద్యోగుల రిక్రూట్మెంట్ దాదాపుగా 14 సంవత్సరాల నుండి ఆగిపోయిందని వెంటనే నూతన రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు, ఆర్టీసీ ప్రైవేటీకరణ జరిగితే స్రీ శక్తి పథకం, వృద్ధులకు, వికలాంగులకు, విద్యార్థులకు రాయితీలు లేకుండా పోతాయన్నారు. ప్రజల ఆస్తి అయినటువంటి ఆర్టీసీ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలోని 400 కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్టీసీ స్థలాన్ని లులు కంపెనీ వారికి 99 సంవత్సరాల లీజుతో ఇప్పటికే అప్పచెప్పారన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకొని ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి, ఉద్యోగుల రిక్రూట్మెంట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, నగర సహాయ కార్యదర్శి రమణ, జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య, ఏఐటీయూసీ నాయకులు లెనిన్ బాబు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ యశోదమ్మ తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు