ప్రముఖ సినీ నిర్మాత, లెజెండరీ ఏవీఎం స్టూడియోస్ అధినేత ఎ.వి.ఎమ్. శరవణన్ (AVM Saravanan) మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పవన్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
Read Also: Sankranti Movies 2026 : సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్
విలువలతో కూడిన చిత్రాలను నిర్మించారు
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏవీఎం (AVM) సంస్థను శ్రీ శరవణన్ గారు సమర్థవంతంగా ముందుకు నడిపారని కొనియాడారు. ఆయన కేవలం నిర్మాతగానే కాకుండా, ఎప్పుడూ వైవిధ్యమైన కథలను, ముఖ్యంగా కుటుంబ సమేతంగా చూసే విలువలతో కూడిన చిత్రాలను నిర్మించారని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏవీఎం ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రాలను పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేకంగా ప్రస్తావించారు.
మెగాస్టార్ చిరంజీవి గారితో నిర్మించిన ‘పున్నమినాగు’ చిత్రం తరాల అంతరం లేకుండా నేటికీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు. అంతేకాకుండా, ‘సంసారం ఒక చదరంగం’, ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘లీడర్’, ‘మెరుపు కలలు’, ‘శివాజీ’ (రజనీకాంత్) వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించారని తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: