📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: PM Modi:ఏపీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ..ఎప్పుడంటే?

Author Icon By Anusha
Updated: September 27, 2025 • 6:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)త్వరలో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారని రాష్ట్ర రాజకీయ వర్గాలు సమాచారం అందించాయి. అక్టోబర్ 16న జరిగే ఈ పర్యటనలో ప్రధాని రాష్ట్రంలోని ముఖ్య ప్రాంతాలను సందర్శించి, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించనున్నారు. పర్యటనలో ముఖ్యంగా కర్నూలు, నంద్యాల జిల్లాలు ప్రధాన కేంద్రంగా నిలిచాయి.

Law University: అమరావతికి అంతర్జాతీయ లా వర్సిటీ… 

ర్నూలులో కూటమి నేతలతో కలిసి రోడ్‌షోలో పాల్గొంటారు. జీఎస్టీ సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ (Chief Minister Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan) తో కలిసి భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ప్రధాని ఏపీ పర్యటనలో భాగంగా.. పలుఅభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇప్పటికే పూర్తయిన కొన్ని ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వివరాలను మంత్రి నారా లోకేష్ శాసనమండలి లాబీల్లో మంత్రులు, ఎమ్మెల్సీలతో ప్రస్తావించారు.

విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు

ప్రధాని పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.ప్రధాని మోదీ జూన్ నెలలో ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. వరల్డ్ యోగా డే (World Yoga Day) రోజు విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. జూన్ 21న జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు యోగాసనాలు వేశారు. ఆ కార్యక్రమం రికార్డ్ కూడా సాధించిన సంగతి తెలిసిందే.

PM Modi

అయితే ఇటీవల కేంద్రం జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. మధ్యతరగతి ప్రజలకు ఊరట దక్కేలా ఈ సంస్కరణలు ఉన్నాయని ఏపీలో కూటమి పార్టీలు స్వాగతించాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చించారు.. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ పర్యటనకు వస్తున్నారు.. జీఎస్టీ సంస్కరణలపై రోడ్ షోలో పాల్గొనబోతున్నారు.

విద్యార్థులకు లాభం చేకూరుతుందని

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటనపై అధికారులు ఫోకస్ పెట్టనున్నారు.జీఎస్టీ 2.0 (GST 2.0) నెక్ట్స్‌ జెన్‌ సంస్కరణల వల్ల రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్ల ప్రయోజనం కలుగుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సామాన్యులు కూడా అర్థం చేసుకునేలా జీఎస్టీ ఉత్తర్వులను తొలిసారి తెలుగులో ఇచ్చామన్నారు. ఈ జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలపై ఖర్చుల భారం తగ్గుతుందన్నారు.

ప్రతి ఇంటికి, రైతులకు, విద్యార్థులకు లాభం చేకూరుతుందని వ్యాఖ్యానించారు. జీఎస్టీ శ్లాబ్‌ల మార్పులతో ట్రాక్టర్ల నుంచి పాఠ్యపుస్తకాలు, మందుల వరకు అన్నింట్లో ఆదా అవుతుందన్నారు. ధరలు తగ్గడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగి.. ఎంఎస్‌ఎంఈ రంగం బలోపేతమవుతుందని అభిప్రాయపడ్డారు. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, చేనేత వస్త్రాలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించడం వల్ల ఎగుమతులు పెరుగుతాయన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

andhra pradesh visit Breaking News Kurnool District latest news nandyal district Narendra Modi october 16 roadshow with coalition leaders state development projects Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.