📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : Prices in sky : చుక్కల్లో ధరలు

Author Icon By Sudha
Updated: November 28, 2025 • 4:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పదాల కన్నా గొప్పది వాక్శక్తి, వాక్శక్తి కన్నా గొప్పది మనసు, మనసు కన్నా గొప్పది సం కల్పం’ మన పాలకుల్లో ఆ సంకల్ప లోపం కార ణంగానే ప్రజలకు ఇక్కట్ల మీద ఇకట్లు వచ్చిపడుతున్నాయేమోన నిపిస్తున్నది. ఇతర సమస్యల మాట ఎలా ఉన్నా రోజురోజుకు పెరిగిపోతూ ప్రజల జీవితాలను నరకప్రాయంగా మారుస్తున్నది. నిత్యావసర వస్తువుల ధరలను (Prices)అదుపులోకి తెచ్చే ఆలోచన కానీ, ప్రయత్నంకానీ త్రికరణశుద్ధిగా జరగడం లేదేమోననిపిస్తున్నది. ఇటు కేంద్రంలోకానీ, రాష్ట్రాల్లో కానీ పాలకులు ఈ ధరల నియంత్రణకు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. కమిటీల మీద కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. పెరుగుతున్న ధరల (Prices)పై ప్రధానంగా నల్లబజారు వ్యాపారులపై ఉకుపాదం మోపుతాం, అవసరమైతే ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామంటూ హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ ఇవేమీ పట్టించుకునే పరిస్థితుల్లో దళారులు లేరు. ప్రస్తుత పాలకులే కాదు ఏ పార్టీ అధికా రంలో ఉన్నా ధరలు పెరిగినప్పుడు వాటిని నియంత్రిస్తామని చెప్పడం, అక్రమ నిల్వలు చేసేవారిపై చర్యలు తీసుకొని జైళ్లకు
పంపుతామని బెదరించడం ఒక రివాజు గా మారిపోయింది. ఈ విషయంలో ఎప్పుడూ చర్యలు తీసుకోలేదని చెప్పడం లేదు. రకరకాల చట్టాలు తెచ్చారు. నిబంధనలు విధించారు. బ్లాక్ మార్కెటీర్లను జైళ్లకు పం పించారు. ప్రభుత్వమన్నా, అందులో పనిచేసే అధికారులన్నా గడగడలాడిన సందర్భాలు లేకపోలేదు. కానీ అవి రానురాను తగ్గిపోతున్నాయి. అధికారులను వారి వారి విధులను స్వేచ్ఛగా చేయనీయడం లేదేమోననిపిస్తున్నది. అన్నింటిలోనూ రాజకీయ జోక్యం మితిమీరిపోతున్నది. తమ సిఫారసులకు, రాజకీయ ఒత్తిడిలకు లొంగని సమర్థులైన అధికారులను బదలీవేటుతో శంకరిగిమాన్యా లను పట్టించడం ఏనాటి నుంచో ఆరంభమైనా నేడు పరాకాష్ఠకు చేరిందని చెప్పొచ్చు. అందుకే అప్పటి భయ భక్తులు ఇప్పుడు లేవు. అధికారుల్లో కూడా అంకితభావం తగ్గిందనే చెప్పాలి. బిల్లు, బెల్లు అనే తీరులో వ్యవహరిం చేవారే ఎక్కువైపోయారు. మరికొందరు అక్రమ వ్యాపార స్తులతో ఇంకొందరు రాజకీయ నాయకులు మమేకం అవు తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే నాయకులకుటుంబ సభ్యుల పేరుతో స్వయంగా వ్యాపారం
చేస్తున్నవారు కూడా ఉన్నారు. ఇదేమీ కొత్త విషయం కాదు. ఇప్పటికి ప్పుడు ప్రారంభమైంది కాదు. కానీ ఈ సంప్రదాయం రానురాను పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే విషయం. రాజకీయమే వ్యాపకంగా జీవనం సాగించేవారి సంఖ్య క్రమేపీ తగ్గిపోతున్నది. డబ్బు సంపాదనే ధ్యేయం గా మారుతుంది. ఎన్నికలు కూడా అలా రూపాంతరం చెందుతున్నాయి. ఇందులో ప్రజల బాధ్యత కూడా కొంత ఉందని చెప్పక తప్పదు. కొందరు బడా వ్యాపారులు మరికొందరు రాజకీయ నాయకులతో అవినాభావ సంబంధాలు ఏర్పర్చుకుంటున్నారు. ఎన్నికల ఖర్చుకు చందాలు ఇవ్వని తప్పని పరిస్థితి. చివరకు ఈ భారమంతా ప్రజలు భరించడక తప్పడం లేదు. దీంతో ఎన్ని కేకలు పెట్టినా, మరెన్ని వాచ్చరికలు చేసినా తమను ఏమీ చేయలేమనే ధీమా అక్రమవ్యాపారుల్లో అంతంతకు పెరిగిపోతున్నది. ధరలు పెరగడానికి ముఖ్యకారణాల్లో ఇదొకటి. ద్రవ్యోల్బ ణంతోపాటు మార్కెట్ మాయాజాలం కూడా ఉందనేది నిర్వివాదం. ప్రస్తుతం పప్పుదినుసుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరో రెండు, మూడు నెలల వరకు కొత్త పంటలు వచ్చేఅవకాశంలేదు. ఖరీఫ్లో పప్పుదిను సులతోపాటు వాణిజ్యపంటలు కూడా అధిక వర్షాలతో బాగా దెబ్బతిన్నాయి. యాసంగి పంట దిగుబడులు వస్తే తప్ప పప్పుదినుసులు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. అందుకే మరింత పెరిగే అవకాశాలున్నాయని అధి కారులు కూడా అభిప్రాయపడుతున్నారు. పప్పుదినుసులే కాదు పేదలు నిత్యం వాడే కారం, ఉప్పు, నూనెలవంటి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. నియంత్రణ, పర్యవేక్షణ కమిటీలు సమీక్షలతో కాలం గడుపుతున్నాయి. పప్పుదినుసుల సాగు రకరకాల కారణాలతో తగ్గిపోతున్న మాట వాస్తవం. దీనికితోడు విడవని వర్షాలు కూడా భారీ నష్టాన్ని చేకూర్చాయి. ఇలాంటి పరిస్థితులను ముందుగా ఊహించి సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారస్తు లు, దళారులు పావులు కదపడం సహజమే. కానీ ఈ విషయంలో పాలకులకు ముందుచూపు లేకపోవడం దుర దృష్టకరం. ఇక కూరగాయల సాగు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నగరాలకు, పట్టణాలకు, చివరకు మండల కేంద్రాలకు దగ్గరల్లో కూరగాయలు సాగవుతున్న భూము లు ప్రస్తుతం ఇండ్ల ప్లాట్లుగా మారిపోయాయి. ఒక్కతెలం గాణ రాష్ట్రంలో చూసుకున్నా లక్షలాది ఎకరాలు మరో యాభైయేళ్లకు సరిపోయే విధంగా ఇళ్ల ప్లాట్లు చేసే శారు. దీనికితోడు ప్రభుత్వం నుండి కూరగాయల సాగుకు అందించే ప్రోత్సాహకాలు కనుమరుగైపోయాయి. మార్కెట్ మాయాజాలంలో కూరగాయల సాగు రైతులు బలైపోతు న్నారు. దీంతో ఆ సాగుకు మంగళంపాడారనే చెప్పొచ్చు. ఫలితంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బీదాబిక్కే కాదు సామాన్యుడు అందుకోలేనంతగా పెరిగిపోయాయి. ఉన్న డబ్బును ఎలా ఖర్చుపెట్టుకోవాలో తోచని నల్లధన స్వాములకు ఏ వస్తువు ధర ఎంత పెరిగినా, చీకుచింత ఉండకపోవచ్చు. నెలజీతం మీదనే ఆధారపడి జీవనం సాగించే మధ్యతరగతి పరిమితి ఆదాయ వర్గాలదేసమస్య అంతా. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర పాలకులు అదుపు లేకుండా పెరిగిపోతున్న ధరల విషయంలో నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News cost comparison latest news price list Prices Telugu News Telugu prices Telugu translation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.