📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

గర్భిణులు బాలింతలు జాగ్రత్త

Author Icon By Sudheer
Updated: February 25, 2025 • 11:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గర్భిణులు బాలింతలు జాగ్రత్త.ఆంధ్రప్రదేశ్‌లో గర్భిణులు, బాలింతలను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు ఫేక్ లింకులు, మెసేజెస్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ‘జనని సురక్ష యోజన’ పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తామంటూ మెసేజ్‌లు పంపించి, బ్యాంక్ వివరాలు తీసుకొని వారి ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్నారు. ఈ మోసాల గురించి బాపట్ల ఎస్పీ తుషార్ డూడీ వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం ఇచ్చారు.

గర్భిణులు బాలింతలు జాగ్రత్త

వాట్సాప్ ద్వారా నకిలీ సందేశాలు

ఈ కేటుగాళ్లు మొదటగా అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎమ్‌ల (ఆక్సిలరీ నర్సింగ్ మిడ్‌వైవ్స్) వివరాలను సేకరిస్తున్నారు. అనంతరం బాలింతలు, గర్భిణుల ఫోన్ నంబర్లను తెలుసుకుని వాట్సాప్ ద్వారా నకిలీ సందేశాలను పంపుతున్నారు. ముఖ్యమంత్రి ఫొటోను ఉపయోగించి నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు.

గర్భిణులు, బాలింతలు అప్రమత్తం

అధికారులు గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అసలు ప్రభుత్వం ఎప్పుడూ వ్యక్తిగత బ్యాంక్ వివరాలు అడగదని స్పష్టం చేశారు. ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్ ద్వారా ధృవీకరించుకోవాలని సూచిస్తున్నారు. ఇటువంటి ఫేక్ మెసేజెస్ వచ్చిన వెంటనే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Cyber Crime Google news pregnant women

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.