📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Sucide: వరకట్న వేధింపులు తాళలేక గర్భిణీ ఆత్మహత్య

Author Icon By Sharanya
Updated: August 16, 2025 • 11:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సమాజంలో అనాదిగా కొనసాగుతున్న కట్నం వేధింపులు మరోసారి అమాయక ప్రాణాన్ని బలి తీసుకుంది. అనంతపురం (Anantapur) జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన శ్రావణి (23) అదనపు కట్నం వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది.

వివాహం తర్వాత ప్రారంభమైన వేధింపులు

నాలుగేళ్ల క్రితం శ్రావణి వివాహం గుండ్లప్పదొడ్డి కాలనీకి చెందిన శ్రీనివాసుతో జరిగింది. మొదట కాపురం సజావుగా సాగినా కొద్ది కాలానికే అత్తింటివారి అసలు స్వభావం బయటపడింది. భర్తతో పాటు అత్తామామలు తరచూ అదనపు కట్నం (Additional dowry) కోసం ఆమెను వేధించడం ప్రారంభించారు.

Sucide

పంచాయితీలు, పోలీసుల వద్ద విఫలం

పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిపినా మార్పు రాలేదు. శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పెద్దగా పట్టించుకోలేదని కుటుంబసభ్యులు వాపోయారు. ఈ నిర్లక్ష్యం కారణంగా శ్రావణి మరింత మానసిక వేదనకు గురైందని వారు ఆరోపిస్తున్నారు.

పుట్టింటివారి ప్రయత్నాలు ఫలించకపోవడం

ఐదు రోజుల కిందటే శ్రావణి పుట్టింటివారు రూ.1.50 లక్షలతో బంగారు నగలు చేయించి ఇచ్చినా అత్తింటి వేధింపులు ఆగలేదని తల్లిదండ్రులు బాధపడ్డారు. పలు సార్లు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకపోయిందని తెలిపారు.

వాయిస్ రికార్డింగ్‌తో చివరి గోడు

తనను ఎవరూ కాపాడరని బాధతో శ్రావణి ఆత్మహత్యకు ముందు సెల్‌ఫోన్‌లో వాయిస్ మెసేజ్ రికార్డు చేసింది. భర్త, అత్తామామల వేధింపులే తన చావుకు కారణమని అందులో స్పష్టంగా పేర్కొంది. కడుపులో బిడ్డతో కలిసి ఈ యువతి తనువు చాలించడం కుటుంబ సభ్యుల హృదయాలను ఛిద్రము చేసింది.

పోలీసుల స్పందన

ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రవిబాబు తెలిపారు. ఆగస్టు 11న కేసు నమోదు అనంతరం భర్త, అత్తామామలకు కౌన్సెలింగ్ ఇచ్చామని చెప్పారు. పోలీసుల వైఫల్యం ఎక్కడైనా ఉంటే, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/nara-lokesh-srikrishna-janmashtami-greetings/andhra-pradesh/530912/

Anantapur News Breaking News Domestic Violence Dowry Harassment latest news Suicide Telugu News Women Issues

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.