📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Prasanna Kumar: వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు?

Author Icon By Anusha
Updated: July 9, 2025 • 4:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత, కోవూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. కోవూరు టిడిపి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో, ఆయనపై నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారం జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు త్వరలోనే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Prasanna Kumar Reddy) ని విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. కోవూరు నియోజకవర్గంలోని పడుగుపాడులో జరిగిన వైసీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో నల్లపరెడ్డి ప్రనన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనంతరం సోమవారం రాత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై కొంతమంది దాడి చేశారు.

ఆయన వ్యాఖ్యలను

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై కొందరు మూకుమ్మడిగా దాడి చేసి కారు, ఇంట్లోని ఫర్నిచర్, కుర్చీలను విరగ్గొట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ మహిళా కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేశారు. తాజాగా ఓ మహిళ ఫిర్యాదు ఆధారంగా కోవూరు పోలీసులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు. త్వరలోనే విచారణకు పిలిచే అవకాశం ఉంది. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి, నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు.” కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారిపై చేసిన అవమానకరమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ కఠినమైన సమయంలో ప్రశాంతి రెడ్డి గారికి సంఘీభావం ప్రకటిస్తున్నాను. మహిళల వ్యక్తిత్వ హననం చేసే విధంగా వారు తరుచూ చేస్తున్న వ్యాఖ్యలు మహిళా సమాజంపై వారి అభిప్రాయాలు ఏంటో తెలియజేస్తున్నాయి.

మహిళలు వీటిని తట్టుకుని మరింత దృఢంగా

ఇలాంటి పోకడలను మహిళా లోకం ఎన్నటికీ క్షమించదు.రాజధాని రైతుల ఉద్యమ సమయంలో కావచ్చు, అమరావతి ప్రాంత మహిళలపై కావచ్చు. గతంలో ఇలాంటి దాడులు, వ్యాఖ్యలే చేశారు. అయితే స్త్రీలను ఇలాంటి పోకడల ద్వారా బలహీన పరచాలనే ప్రయత్నాలు ఫలించవు. నేటి తరం మహిళలు వీటిని తట్టుకుని మరింత దృఢంగా ముందుకు సాగుతారు అనడంలో సందేహం లేదు. అవమానకరమైన వ్యాఖ్యలు, ఆత్మగౌరవం దెబ్బతీసే చర్యలతో మహిళల విలువను, స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేరు. స్త్రీ (Womens) లను గౌరవించే మన సంస్కృతిలో, దానిని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నైనా అందరూ తిప్పికొట్టాలి. ఈరోజు, రేపు, ఎప్పుడైనా సరే, స్త్రీలను కించపరిచే, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే చర్యలను ఐక్యంగా ఎదిరించి మరింత బలంగా నిలబడదాం” అంటూ నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు.

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎవరు?

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఓ కీలక పాత్ర పోషించారు.

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఏ పార్టీకి చెందినవారు?

ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (Yuvajana Sramika Rythu Congress Party – YSRCP)కి చెందిన నాయకుడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Jakkampudi Raja: జనసేనలో చేరుతున్నానన్న వార్తలపై జక్కంపూడి ఏమన్నారంటే?

NallapareddyPrasannaKumarReddy NelloreNews ObjectionableCommentsCase

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.