విజయవాడ ప్రకాశం బ్యారేజి (Prakasam Barrage) వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద నీరు భారీగా వస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ (Collector Dr. G. Lakshmi) అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
పులిచింతల నుంచి భారీగా నీటి విడుదల
పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి (Prakasam Barrage) 65 వేల క్యూసెక్కుల వరద నీరు విడుదల అవుతోంది. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదకు అనుగుణంగా నీటిని కిందకు విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంత ప్రజలకు వరద హెచ్చరికలు జారీ చేశారు.
ప్రకాశం బ్యారేజీకి ఈరోజు (బుధవారం) మధ్యాహ్నానికి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాబోయే రెండు రోజుల్లో దాదాపు మూడు లక్షల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
ఈ పరిస్థితిపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని సిద్ధం చేయాలని, ఇసుక బస్తాలు, ఇతర రక్షణ చర్యలకు స్థానికంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అధికారులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఎక్కడ ఎటువంటి సమాచారం వచ్చినా క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కృష్ణానది (Krishna River) లో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం, నాటు పడవుల్లో ప్రయాణించడం వంటివి చేయవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
ప్రకాశం బ్యారేజీని ఎవరు నిర్మించారు?
2.00 కోట్లతో నిర్మించిన ఈ అభయారణ్యం, కృష్ణ, పశ్చిమ గోదావరి, గుంటూరు మరియు ప్రకాశం జిల్లాల్లోని 5.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు సేవలందించేందుకు సర్ ఆర్తుర్ కాటన్ రూపొందించి కెప్టెన్ చారీస్ ఓర్ నిర్మించారు.
ప్రకాశం బ్యారేజీకి ఎన్ని గేట్లు ఉన్నాయి?
70 గేట్లతో విస్తరించి ఉన్న భారీ మరియు పొడవైన – సమీక్షలు, ఫోటోలు – ప్రకాశం బ్యారేజ్ – ట్రిప్ అడ్వైజర్.
ప్రకాశం బ్యారేజీ ఏ నది ప్రవహిస్తుంది?
2-10-2009 నుండి 13-10-2009 వరకు ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి చారిత్రాత్మక వరదలు వచ్చాయి. 05-10-2009న రాత్రి 11.00 గంటలకు గరిష్టంగా 11,10,404 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది, ఇది ప్రకాశం బ్యారేజీ నిర్మాణం తర్వాత నమోదైన అత్యధిక వరద విడుదల.
Read Hindi News : hindi.vaartha.com
Read also: Ration Card Distribution : ఆగస్టు 25 నుంచి 31 దాకా రేషన్ కార్డుల పంపిణి