📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

AP CM : విద్యుత్ లేని ఊరు నుంచి వచ్చాను – విద్యుత్ సంస్కరణలు తెచ్చాను

Author Icon By Shravan
Updated: August 13, 2025 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ Power : విద్యుత్ లేని ఊరు నుంచి వచ్చాను.. ఉమ్మడి రాష్ట్రంలోనే విద్యుత్ సంస్కరణలు తెచ్చానని సత్య విద్యార్థి అభివృద్ధి వెన్నెంచి ఉంటూ.. నిరంతరం ఆలోచించడం వల్లే ఇది సాధ్యమైందని ముఖ్యమంత్రి వివరించారు. నియోజకవర్గాల వారీ సమగ్రాభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి పీజీ చేసిన ఒక యంగ్ ప్రొఫెషనల్ ను నియమిచింది. స్వర్ణాంధ్ర విజన్ (Swarnandhra Vision) 2047 భాగంగా రూపొందించిన నియోజకవర్గాల వారీ విజన్ డాక్యుమెంట్లకు అనుగుణంగా పనిచేసేందుకు నియమితులైన ఈ యంగ్ ప్రొఫెషనల్స్ కు ప్రణాళిక శాఖ వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. మంగళవారం సచివాలయలోని ఐదో బ్లాకులో శిక్షణ ముగించుకున్న యంగ్ ప్రొఫెషనల్స్ తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో యంగ్ ప్రొఫెషనల్స్ కు సీఎం దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..”నియోజకవర్గానికో యంగ్ ప్రొఫెషనల్ నియమించడం కొత్త విధానం. నేను తొలిసారి సీఎం కాగానే ప్రాధాన్యతాం. నేను గుర్తించి.. దానికి అనుగుణంగా ప్లానింగ్ చేసుకున్నాను. యంగ్ ప్రొఫెషనల్స్ కూడా వారికి కేటాయించిన నియోజకవర్గాల అభివృద్ధికి ప్రాధాన్యతాంశాలను గుర్తించాలి.

స్థానికంగా ఉండే ఎమ్మెల్యే సహా మిగిలిన వారితో సంప్రదింపులు జరిపి నియోజకవర్గాల అభివృద్ధికి కచ్చితంగా ప్లానింగ్ చేసుకోవాలి. నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికకు అనుగుణంగా పనిచేస్తే… సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజలకు ఏది మంచిదో చెప్పాలి.. సరైన విధానాలు అవలంభించకపోతే ఎలాంటి పరిణామాలు వస్తాయో ప్రజలకు యంగ్ ప్రొఫెషనల్స్ వివరించాలి. ఎక్కడెక్కడ ఏయే సమస్యలు వస్తాయనే అంశంపైనా ముందుగా అంచనాలు వేయగలగాలి. ఈ ఏడాది వర్షపాతం చాలా తక్కువగా ఉంది.. అయినా ముందు చూపుతో నీటిని సద్వినియోగం చేసుకుని రిజర్వాయర్లను నింపాం. రికార్డు సమయంలో హంద్రీనీవా కాల్వల వెడల్పు పనులు పూర్తి చేసి.. నీటిని విడుదల చేశాం. ఫలితంగా రాయలసీమ సహా అన్ని ప్రాజెక్టుల్లో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం ప్రాజెక్టులకున్న కెపాసిటీలో 80 శాతం మేర నీటిని నిల్వ చేసుకోగలిగాం. దీని వల్ల భూగర్భ జలాలు పెరిగాయి.” అని సీఎం చెప్పారు. ప్రతి నియోజకవర్గానికీ ఓ బలం ఉంటుంది.

అభివృద్ధికి దోహదపడే సహజ వనరులు ఉంటాయి. అలాంటి ప్రభషనల్స్ గుర్తించి. అధటిన నాటియాయంగ్ వనరుల ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి (Development) చేసేందుకు కావాల్సిన చర్యలన్నీ మేం చేపడుతున్నాం. రాష్ట్రంలోని రోడ్ల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నా… పాత్ హోల్స్ నిమిత్తమే రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టాం. జాతీయ రహదారులను పెద్ద ఎత్తున నిర్మిస్తున్నాం… ఏపీలో రోడ్లు అమెరికా స్థాయిలో ఉంటాయని నితిన్ గడ్కరీ చూడా చెప్పారు. విద్యుత్ రంగంలో గ్రీన్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. టెక్నాలజీని అన్ని రంగాల్లో వినియోగించు కుంటున్నాం. రాష్ట్ర సమగ్ర, సుస్థిరాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం. ఇలా జరుగుతున్న అభి వృద్ధి.. సంక్షేమ కార్యక్రమాలను యంగ్ ప్రొఫెష నల్స్ నిరంతరం చూసుకుంటూ ఉండాలి. యంగ్ ప్రొఫెషనల్సుకు ఇదో అద్భుతమైన అవకాశం.. సీఎంగా పని చేసిన నాకు ఎంత అనుభవం వచ్చిందో… మీకూ అంతే అనుభవం వస్తుంది. యంగ్ ప్రొఫెషనల్స్ గా విధులు చేరాక.. ఇబ్బం దులూ ఎదురవుతాయి.. ప్రజా ప్రతినిధులను మంచి అనుభవం కూడా వస్తుంది. ఇన్నాళ్లు అధికారులను సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/defence-principal-secretary-home-ministry-kumar-vishwajit/andhra-pradesh/529682/

Breaking News in Telugu electricity development electricity supply Latest News in Telugu Paper Telugu News power reforms power sector rural electrification

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.